బడులు ఎప్పుడు తెరుస్తారు?

 
` సమ్మక్క జాతరపై నివేదిక ఇవ్వండి
` హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్‌,జనవరి 28(జనంసాక్షి):మేడారం జాతర, వారాంతవు సంతల్లో కొవిడ్‌ జాగ్రత్తలపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ నిర్వహించింది. ఈనెల 31 నుంచి పాఠశాలలు తెరుస్తారా అని హైకోర్టు ఆరా తీసింది. స్కూళ్ల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ న్యాయవాది తెలపగా.. వెంటనే ప్రారంభంపై వివరాలు తెలపాలని ఆదేశించింది. ఆన్‌లైన్‌ విచారణకు డీహెచ్‌ శ్రీనివాసరావు హాజరయ్యారు. తెలంగాణలో కరోనా పాజిటివిటీ రేటు 3.16 శాతంగా ఉంది. 77 లక్షల ఇళ్లల్లో ఫీవర్‌ సర్వే చేసి 3.45 లక్షల కిట్లు అందజేసినట్టు డీహెచ్‌ తెలిపారు. కిట్లలో పిల్లల చికిత్స ఔషధాలు లేవని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. పిల్లలకు మందులు కిట్ల రూపంలో నేరుగా ఇవ్వకూడదని డీహెచ్‌ పేర్కొన్నారు. 3 రోజుల్లో పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేశారు. కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది. అయితే ఈ నెల 31 నుంచి పాఠశాలలు తెరుస్తారా అని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. అదే విధంగా వారాంతవు సంతల్లో కోవిడ్‌ నియంత్రణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సమ్మక్క జాతర ఏర్పాట్లపై నివేదిక సమర్పించాలని కూడా హైకోర్టు ఆదేశించింది. కిట్లలో పిల్లల చికిత్స ఔషధాలు లేవన్న న్యాయవాదులు ప్రస్తావించగా.. పిల్లలకు మందులు కిట్ల రూపంలో నేరుగా ఇవ్వకూడదన్న డీహెచ్‌ తెలిపారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో నివేదికను మూడు రోజుల్లో సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కరోనా పరిస్థితులపై విచారణ ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది.