ఆయిల్‌ పామ్‌ సాగుతో లాభాలు అధికం




జిల్లాలో పలు తోటలను పరిశీలించిన మంత్రి హరీష్‌

ఖమ్మం,జనవరి29 (జనంసాక్షి): ఆయిల్‌ పామ్‌ సాగుచేసే రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు అన్నారు. వారికి సబ్సిడీ కూడా ఇస్తున్నామని అన్నారు. అంతరపంటలు కూడా వేసి లాభాలు గడిరచవచ్చన్నారు. ఇదిలావుంటే మాజీమంత్రి తుమ్మలతో కలసి ఆయన జిల్లాలో ఆయిల్‌ పామ్‌ సాగు తోటలను పరిశీలించారు. ఆయిల్‌పామ్‌కు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తోందన్నారు. దీంతో రైతులకు కూడా మంచి లాభాలు వస్తాయన్నారు. అంతకుముందు సత్తుపల్లి నియోజకవర్గ కేంద్రంలో రూ.34కోట్ల రూపాయలతో నిర్మించనున్న 100పడకల ప్రభుత్వ హాస్పిటల్‌ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు శంకుస్థాపన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, ఎంపీ నామా నాగేశ్వరరావు ,జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌ రాజ్‌ తదితరులు ఉన్నారు. సండ్ర కోరిన వెంటనే సిఎం ఆసుపత్రి మంజూరు చేశారని అన్నారు. ఖమ్మం జిల్లాలో రాష్ట్రవైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు రెండో రోజు పర్యటిస్తున్నారు. సత్తుపల్లి మండలం నారాయణపురంలో శ్రీషిర్డి సాయి ఆస్పత్రి నిర్మాణానికి హరీశ్‌ రావు శంకుస్థాపన చేశారు. షిర్డీసాయి జనమంగళం ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 100 కోట్లతో 250 పడకల ఆస్పత్రి నిర్మిస్తున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్న ట్రస్టు సభ్యులను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పాల్గొన్నారు. సంక్షేమానికి చిరునామా తెరాస ప్రభుత్వమని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇప్పటివరకు 10 లక్షల మందికి కల్యాణ లక్ష్మి పథకం కింద డబ్బులు ఇచ్చామని వెల్లడిరచారు. ప్రజలకు వైద్య సేవలు చేరువ చేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నామని పునరుద్ఘాటించారు. ఆస్పత్రిలో సిబ్బందిని సైతం పెంచుతామన్న హరీశ్‌... కావాల్సిన వైద్య పరికరాలను అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా డయాలసిస్‌ రోగులకు చికిత్స అందిస్తున్నామని హరీశ్‌ రావు తెలిపారు. సత్తుపల్లిలోనూ డయాలిస్‌ కేంద్రం ఏర్పాటు చేశామన్న మంత్రి.. మరో ఐదు మిషన్లు ఏర్పాటు చేస్తామని హావిూ ఇచ్చారు. తెలంగాణలో అమలు చేస్తున్న ఎన్నో సంక్షేమ పథకాలను ఇతర రాష్టాల్రు ఆదర్శంగా తీసుకున్నాయి. ఏదోరకంగా ప్రతి ఇంటికి పథకాలు చేరుతున్నాయి. ఆడపిల్లలకు కల్యాణ లక్ష్మి పథకం కింద చేయూతనిస్తున్నాం. ఇప్పుడు పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల నూతన ఆస్పత్రులు నిర్మిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోకోవిడ్‌ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావుతెలిపారు. వ్యాక్సిన్‌ పంపిణీలో భాగంగా అర్హులైన వారందరికీ బూస్టర్‌ డోస్‌ ఇస్తున్నామని తెలిపారు. సత్తుపల్లిలో 100శాతం కోవిడ్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు.ప్రతి జిల్లా కేంద్రానికి డయాలసిస్‌ కేంద్రం, ఐసీయూ వార్డులు తీసుకొచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రాష్టాన్న్రి ఆరోగ్య తెలంగాణగా మార్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని తెలిపారు.