సోషల్‌ మీడియాకు స్వీయనియంత్రణ అవసరం

` వ్యక్తిగత దూషణలు వద్దు

` పరుష పదజాలం వాడొద్దు
` సోషల్‌మీడియా యాక్టివిటిస్ట్‌లపై అక్రమకేసులు ఎత్తివేయాలి
` జర్నలిస్టుల అధ్యయన వేదిక డిమాండ్‌
హైదరాబాద్‌,జనవరి 8(జనంసాక్షి):తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో విూడియా స్వేచ్ఛ `ప్రజాస్వామ్య పరిరక్షణ అంశంపై శనివారం రౌండ్‌ టెబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సమావేశంలో వక్తలు మాట్లాడారు.ఇటీవల కాలంలో జరుగుతున్న అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిరచారు.సోషల్‌ విూడియాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా సోషల్‌ విూడియా శకం నడుస్తోందన్నారు. సోషల్‌ విూడియాలో పని చేసేవారికి కూడా జర్నలిస్టులందరికీ వర్తించిన విధివిధానాలే వర్తిస్తాయన్నారు.సాంప్రదాయ విూడియా (ప్రధాన స్రవంతిలో ఉన్న విూడియా)కుఉన్న నియమాలు, నిబంధనలే వీరికి వర్తిస్తాయన్నారు.స్వయం నియంత్రణతో వ్యక్తిగత దూషణలకు తావు లేకుండా విధానపరమైన విషయాలపై వార్తలు ప్రసారం చేయాలన్నారు. పరుష పదజాలం వాడరాదని ఈ సందర్భంగా తీర్మానించారు. జర్నలిస్టులపై అక్రమ కేసులు తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. .చట్టవిరుద్ధంగా రూంలపై దాడులుచేసి, అరెస్ట్‌ చేయడమే కాకుండా జర్నలిస్టులపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై చర్యకు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.వేదిక అధ్యక్షులు బోధనపెల్లి వేణుగోపాల్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సాదిక్‌ రౌండ్‌ టెబుల్‌ సమావేశం నిర్వహించారు.జర్నలిజాన్ని బతికించుకుంటేనే ప్రజాస్వామ్యన్ని పరిరక్షించుకోగలంజ్జానం ఉన్నవాడే ప్రశ్నిస్తారని, ఆ ప్రశ్నంచే త్వత్వమే జర్నలిజం మని వక్తాలు అభిప్రాయపడ్డారు.సంప్రదాయ విూడియా అంతగా,ఆధునిక విూడియాను అర్థం చేసుకోలేదుగనుకే డిజిటల్‌ విూడియా అవతరించిందని సీనియర్‌ సంపాదకులు కె శ్రీనివాస్‌ అభిప్రాయపడ్డారు.పత్రిక రంగం ప్రజాస్వామ్య మౌలిక రంగానికి సంబంధించిదని చేప్పారు..విలువలు దాటుతున్నారని ప్రభుత్వం భయపెట్టడం సరికాదన్నారు.విూడియా అంతా ఒకటేనని అందరికి ఒకే ఎథిక్స్‌ వర్తిస్తాయని సీనియర్‌ సంపాదకులు శ్రీనివాస్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు.ఇదే అంశం బాంబే హైకోర్టు చేప్పిన విషయాలను గుర్తు చేశారు.పత్రిక స్వేచ్ఛ ప్రజలను కాపాడుతుందని,వృత్తిని నిబద్ధతతో కొనసాగించాలన్నారు స్వయం నియంత్రణ తో జర్నలిస్టు విలువను ప్రజాస్వామ పరిరక్షణకు పాటుపడాలన్నారు.ధర్మం క్షేత్రం.. కురుక్షేత్రం మధ్య పోరాటం జరుగుతోందని సినియర్‌ జర్నలిస్టు పాశం యాదగిరి అన్నారు.ప్రజల తరఫున పోరాడే వారికి సంఫీుభావం తెలపాలన్నారు.సమస్యలు వస్తుంటే మౌనంగా ఉండొద్దని అది ప్రజాస్వామ్యంలో ప్రజలే పరిపాలకులన్నారు. ప్రజలందరూ జర్నలిస్టులేని చేప్పారు.యూట్యుబ్‌ చానెల్‌ జర్నలిస్టులను రాత్రికి రాత్రే ఎత్తుకువడం తీవ్రంగా ఖండిరచారు. వారు పోలీసులా..? టీఆర్‌ఎస్‌ కార్యకర్తల అని ప్రశ్నించారు. జర్నలిస్టులను ఎత్తుకుపోయినా వాళ్లేవరో డీజీపీ చెప్పాలని డిమాండ్‌ చేశారు.రాష్ట్రంలో జరిగే పరిణామాలపై సిబిఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.నిర్బంధాల పాలన ముందుకు సాగదని సినియార్‌ జర్నలిస్టు పివీ శ్రీనివాస్‌ అన్నారు.ప్రజల మనసులను గెలుచుకునే పాలన ఉండాలన్నారు.రాజకీయ పార్టీల చేతులకు విూడియా పోవడం దురదృష్టకరమని అవేదన వ్యక్తం చేశారు.విూడియా.. సోషల్‌ విూడియా పై చర్చ జరిగితేనే ప్రజాస్వామ్య పరిరక్షణకు బాటలు పడుతాయిని చేప్పారు.తెలంగాణ ఉద్యమ సమయంలో మా గొంతు నొక్కుతున్నరని సీఎం కేసీఆర్‌ మోత్తుకుండనితెలంగాణ వచ్చాక జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారని సినియర్‌ జర్నలిస్టు జయసారథి రెడ్డి అన్నారు.సెక్రటేరియట్‌.. బల్దియా.. అసెంబ్లీలోకి విూడియాను రానివ్వడం లేదని.స్వరాష్ట్రం కొసం ఉద్యమించిన జర్నలిస్టులను దూరం చేయ్యడం దారుణమన్నారు.తెలంగాణ లో స్వేచ్ఛ ఉందా..? ఉమ్మడి పాలనలో స్వేచ్ఛ ఉందా..? ప్రశ్నించారు.తెలంగాణలో పుట్టినోడు ప్రశ్నకు... ప్రశ్నించడానికి భయపడడని అన్నారు.ఉద్యమం.. చైతన్యం ద్వారా వచ్చిన నాయకుడు.. వాటిని ఎట్లా పాతరేస్తుండో తెలుస్తోందని ఈటల రాజేందర్‌ అన్నారు. రాజ్యం హక్కులు.. విూడియా పై దాడి చేస్తుందో అదే వారి పతనం అంచున చేర్చుతుందని చేప్పారు.హుజూరాబాద్‌ లో సొంత ఓటు హక్కు ను కూడా డబ్బు తో కొన్నది. ఓటర్లను ఎన్ని రకాలుగా బెదిరించారో..అన్ని రకాలుగా బెదిరించారని గుర్తు చేశారు.ధర్మం.. ప్రజలు.. ఆత్మ గౌరవం గెలిచి.. కేసీఆర్‌ అహంకారం ఓడిపోయిం దన్నారు.విూడియాను కొనుక్కునే ప్రయత్నం.. లేదంటే బెదిరించడం ప్రజాస్వామ్యనికి మంచిదికాదన్నారు. ప్రభుత్వ పిచ్చి పనులను సహించేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరన్నారు.పార్టీలు.. సిద్ధాంతాలు ఏవైనా కావచ్చు.. పత్రిక స్వేచ్ఛ ప్రజల స్వేచ్ఛకు సంబంధించినది.సావుకైనా తెగిస్తం.. హక్కులను కాపాడుకుంటం. ఆకలైనా తట్టుకుంటరు.. ఆత్మ గౌరవాన్ని వదులుకోరు తెలంగాణ ప్రజలు..ఐక్యంగా ఉందాం.. చట్ట పరిధిలో పోరాడుదాం.. నా వంతు మద్దతు ఉంటుందని హవిూ ఇచ్చారు.ప్రశ్నించే గొంతుకలు అరెస్టులను ఖండిరచారు.