రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయండి

 

 

 

 

 

 


` ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్‌,జనవరి 17(జనంసాక్షి):రాష్ట్రంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో పరీక్షల సంఖ్యను పెంచాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. ఆర్టీపీసీఆర్‌ టెస్టుల సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయాలంది. అలాగే ఆర్టీపీసీఆర్‌, ర్యాపిడ్‌ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని తెలిపింది. భౌతికదూరం, మాస్కుల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలంది. కరోనా నియంత్రణపై ఈరోజు మంత్రివర్గం చర్చిస్తున్నట్లు ఏజీ హైకోర్టుకు తెలిపింది. పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కరోనా కేసులపై విచారణను హైకోర్టు ఈనెల 25కు వాయిదా వేసింది. కరోనా వ్యాప్తి వల్ల రేపట్నుంచి కేసుల విచారణ వర్చువల్‌గా జరగనుంది.