గతిలేక గదిలోనే విష పురుగుల తో 108 సిబ్బంది సాహసం



కొత్తగూడ ఫిబ్రవరి 11 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉండే మొదటగా గుర్తుకు వచ్చే వాహనాలు 108,102 ప్రజలకు ఎంతో అవసరమైన వాహనాలలో పనిచేసే సిబ్బందికి కనీస ఉండడానికి కూడా నీడ లేని పరిస్థితి,శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి ఒకే రూములో ఆరుగురు సిబ్బంది ఉండడం జరుగుతుంది.108 సిబ్బంది మాట్లాడుతూ ఇలా శిధిలావస్థలో ఉన్న రూమ్ లోనే మేము ఉండడం జరుగుతుంది.ఈ గదిలోనే పాములు,తేళ్లు,ఎలుకలతో రోజువారీగా జీవనం సాగిస్తూ ఏ సమయాన ఫోన్ వచ్చిన విధులను పాటిస్తూ అత్యవసర రంగాలకు వెళ్లి ప్రజలకు అందుబాటులో ఉండడం జరుగుతుంది.ప్రజల ప్రాణాలను కాపాడుతున్న మాకు మా ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది.కనీసం సేద తీరడానికి గదులు లేక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.విష పురుగుల భయంతో రాత్రులు నిద్ర కూడా పట్టడం లేదు.ప్రజల ప్రాణాలకు మేము నిరంతరం పని చేస్తున్న మా గురించి పట్టించుకునేవారు లేరు. మల మూత్ర విసర్జన గదులు కూడా లేకపోవడం చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో మేము కాలాన్ని వెళ్లడం జరుగుతుంది.అదేవిధంగా 108 వాహనానికి కనీసం షెడ్డు లేకపోవడం వాననక,ఎండనక నిరంతరం ఆరుబయటే ఉండటం జరుగుతుంది.అధికారులు ఇప్పటికైనా స్పందించి మాకు ఉండడానికి గదిని ఏర్పాటు చేయాలని 108,102 సిబ్బంది కోరడమైనది.