అమూల్‌ పాలపై రూ.2 పెంపు


హైదరాబాద్‌,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  సామాన్యుడి నెత్తిపై మరింత భారం పడనుంది. ఇప్పటికే కరోనా సమయంలో నిత్యవసర సరుకుల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న ప్రజలపై అదనంగా భారం పడనుంది. పాల ధరలను పెంచుతున్నట్టు అమూల్‌ సంస్థ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. లీటర్‌ పాలపై రూ. 2 పెంచుతున్నట్టు ఆ సంస్ధ యాజమాన్యం తెలిపింది. దీంతో, పెరిగిన ధరలు మార్చి 1వ తేదీ మంగళవారం నుంచి అమలులోకి రానున్నాయి. కాగా, అమూల్‌ బ్రాండ్‌లో ఉన్న అన్ని రకాల పాల ఉత్పత్తులకు కొత్త ధరలు వర్తించనున్నాయి. ఆవు, గేదె పాలకు చెందిన అన్ని రకాల ఉత్పత్తులపై ఈ ఛార్జీలు వర్తిస్తాయి. ఇదిలా ఉండగా.. అమూల్‌ సంస్థ చివరి సారిగా గతేడాది జూలైలో పాల ధరలను పెంచింది. మరోవైపు తమ కస్టమర్లకు అమూల్‌ సంస్థ ట్విట్టర్‌ వేదికగా శివరాత్రి శుభాకాంక్షలను తెలిపింది.