శ్రీశైలంలో 22 నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు

22 నుంచి మార్చి 4 వరకు ఉత్సవాల నిర్వహణ

కర్నూలు,ఫిబ్రవరి10(జనంసాక్షి): ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈనెల 22న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22 నుంచి మార్చి 4 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల నేపథ్యంలో స్వామివారి అన్ని సేవలను నిలిపివేయనున్నట్లు అధికారులు వెల్లడిరచారు. బ్రహ్మోత్సవాల్లో నల్లమల అడవుల నుంచి కాలినడకన శ్రీశైలం వచ్చే భక్తులు, శివస్వాములకు ప్రాదాన్యతనిస్తామని ఆలయ ఈఓ లవన్న తెలిపారు. నల్లమలలోని పెద్దచెరువు నాగలూటి వెంకటాపురం బీమునికొలను వద్ద భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవాలని సూచించారు. కరోనా నిభందనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.