మరో రూ.27 వేల కోట్ల రుణానికి ఎపి వినతి

రాజ్యసభలో కనకమేడల ప్రశ్నకు ఆర్థిక శాఖ సమాధానం

న్యూఢల్లీి,ఫిబ్రవరి8(జనం సాక్షి): ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి నాటికి మరో రూ.27 వేల కోట్లు అప్పులు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ అనుమతి కోరిందని కేంద్రం వెల్లడిరచింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదురి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. బహిరంగ మార్కెట్లో రూ.27 వేల కోట్లు అప్పు చేసేందుకు ముఖ్యమంత్రి జగన్‌ విజ్ఞప్తి చేశారని కేంద్ర ఆర్ధిక శాఖ పేర్కొంది. 2021` 22 సంవత్సరానికి గాను రూ. 27,325.78 కోట్ల అప్పులు బహిరంగ మార్కెట్లో చేసేందుకు రాజ్యాంగంలోని 293(3) నిబంధన కింద అనుమతి ఇవ్వాలని.. డిసెంబర్‌ నెలలో జగన్‌ మోహన్‌ రెడ్డి ఢల్లీి పర్యటనలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు కేంద్ర ఆర్ధిక శాఖ స్పష్టం చేసింది. జగన్‌ విజ్ఞప్తి మేరకు కేంద్రాన్ని కోరామని ఆర్ధిక శాఖ తెలిపింది. బహిరంగ మార్కెట్లో అప్పులు చేసేందుకు 2021`22 ఆర్థిక సంవత్సరానికి గాను వున్న పరిమితిని రూ.42,472 కోట్లకు పెంచాలని జగన్‌ కోరారని ఆర్ధిక శాఖ పేర్కొన్నది. ఇదిలావుంటే ఆర్బీఐలో రాష్ట్ర సెక్యూరిటీల వేలం
ద్వారా జగన్‌ సర్కార్‌ కొత్తగా రూ. 2000 వేలకోట్లు అప్పుతెచ్చింది. ఆ అప్పు ఆర్భీఐ వద్దే ఓడీ కింద జమ చేసింది. 7.37 శాతం అత్యధిక వడ్డీకి సెక్యూరిటీలను వేలం వేసింది. రాష్ట్ర క్రెడిట్‌ రేటింగ్‌ దారుణంగా ఉండడంతో అత్యధిక శాతం వడ్డీకి సెక్యూరిటీలను వేలం వేసింది. రూ. 1000 కోట్లు అప్పు కాల పరిమితి 16 ఏళ్ళు కాగా మరో రూ. 1000 కోట్ల అప్పు కాల పరిమితిని 20 ఏళ్ళకు పెంచింది.