వెయ్యేళ్ల నాటి విప్లవ శంఖం..రామానుజాచార్యులు!


ముచ్చింతల్‌,ఫిబ్రవరి1 (జనం సాక్షి):   భారతీయ ఆధ్యాత్మిక జగత్తులో రామనుజాచార్యుల వారిది ఖచ్చితంగా ప్రత్యేక స్థానమే. వెయ్యేళ్ల క్రితం అంటే... దళితులకు ఆలయ ప్రవేశం చేయించిన రామానుజాచార్యులు.. వాళ్లను అర్చకులుగానూ మార్చారు. వారితో కలసి సహపంక్తి భోజనం చేశారు. నారాణమంత్రాన్ని అందరికీ బహిరంగగంగా ఉపదేశించారు. ఆయన ఆనాడు వేళ్లూనుకున్న వర్ణవ్యవస్థలో ఓ విప్లవం తీసుకుని వచ్చారు. పేదల ఇళ్లల్లో, దేవాలయాల్లో పూజారులుగా ఏర్పాటు చేసి గౌరవించారు. ప్రజల చేత గౌరవించేలా చేశారు. అంతే కాదు, దేవాలయ నిర్వహణ వ్యవస్థలనూ పూర్తిగా మార్చివేశారు. అన్ని వర్గాల వారికీ దేవుడి సేవలో సమ ప్రాధాన్యత ఇచ్చేలా చేశారు. తన జీవితాంతం, ఇదే విషయాన్ని బోధించారు. ఈయన నేతృత్వంలో ఏర్పాటైన... ఆళ్వారుల వ్యవస్థను సైతం... ఆ సిద్దాంతాలకు అనుగుణంగానే నిర్వహించారు. అంతర్జాతీ యంగా.. వైష్ణవాన్ని ప్రచారం చేసేందుకు 12 మంది ఆల్వారులను నియమించగా... వారిలో ఒకరే బ్రాహ్మణుడు. మిగతా వారు.. అన్ని కులాలు వాళ్లూ ఉన్నారు. పైగా వీరిలో ఒకరు స్త్రీ కావడం విశేషం. వీరంతా పూజ్యనీయులన్న రామానుజులు... కుల, లింగ భేదాలకు అతీతంగా జీవించారు. సమాజంలో ఎన్నో సంస్కరణలు ఎన్నో చేశారు. వర్ణ వ్యవస్థలోని ఎలాంటి అసమానతలను సహించేవారు కాదు. ఆయన శిష్యులలో చాలామంది నిమ్న వర్గాల వారే... కావడం మనం చూడవచ్చు. దేవుడి రథయాత్ర సమయం లోనూ వాళ్లే ముందుగా రథాన్ని లాగేవారు. ఇప్పటికీ అదే సంప్రదాయం కొనసాగుతోంది. మనిషి అంతరంగంలో అహంకారం అనే జబ్బును నయం చేసేందుకు సమతా స్పూర్తి అనే మందును వెయ్యేళ్ల క్రితమే రామానుజులు ఆచారించారన్న చినజీయర్‌ వ్యాఖ్యలు అఓర సత్యాలు. ఆనాడు తమిళనాడు మొదలుకుని దక్షిణాది రాష్టాల్ల్రో ఉన్న దురాచారాలపై తిరుగుబాటు చేసిన సంఘసంస్కర్త రామానుజా చార్యలు వారు. సర్వప్రాణి సేవే నినాదంగా రామానుజచార్యులు ముందుకు సాగిన విషయాన్ని జీయర్‌ స్వామి గుర్తు చేసుకొన్నారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న అతి భయంకరమైన వైరస్‌ అసమానత అని ఆయన పేర్కొన్నారు. నిజానికి దీనికి ఆనాడే రామానుజుల వారు సమానత్వమే మందుగా భావించి ఆచరించారు. ఆనాటి సమాజంలో ఎంతగా వ్యతిరేకత వచ్చినా..తనపై దదాడులు చేసినా..దళితులను రామానుజా చార్యులు ఆలయ ప్రవేశం చేయించారు. ఇందులో భాగంగానే రామానుజచార్యుల వెయ్యే ళ్ల పండుగ జరుగుబోతున్నది. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌ వద్ద ఏర్పాటు చేసిన సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణకు చినజీయర్‌ స్వామిపూనుకోవడం ముదావహం. ఇది దేశానికి,ప్రంపచానికి, మనకూ

గర్వకారణం.