ఏ సి బి దాడిలో పట్టుబడిన ఎలక్ట్రికల్ లైన్మెన్


యస్ రాయవరం. ఫిబ్రవరి 11 .జనం సాక్షి.

విశాఖజిల్లా యస్. రాయవరం మండలం అడ్డురోడ్డు ఎలక్ట్రిక్ లైన్ మేన్ గా పని చేస్తున్న ఎన్ నాగేశ్వర్రావుపై శుక్రవారం నాడు ఏసిబి దాడులు జరిగాయి. ఏసిబి డిఎస్పి . బి వి ఎస్ ఎస్ రమణ మూర్తి అందించిన వివరాల ప్రకారం గుర్రాజుపేట గ్రామానికి చెందిన దాట్ల కృష్ణంరాజుకు చెందిన రెండు బోర్ వెల్ కనెక్షన్ల నిమిత్తం ఎనిమిది వేలు లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు చేశారన్నారు. దానిపై సమగ్ర విచారణ అనంతరం  శుక్రవారం ఉదయం రైతు  కృష్ణంరాజు  లైన్మేన్ నాగేశ్వరరావుకు తన పొలంలో డబ్బులు 8000 ఇస్తుండగా వల వేసి  పట్టుకున్నట్లు ఏ సి బి డిఎస్పీ రమణమూర్తి తెలిపారు. లైన్మేన్ నాగేశ్వర్రావు పై కేసు నమోదు చేసి ఏ సి బి కోర్టులో హాజరు పరుస్తామని ఆయన తెలిపారు.