సమ్మెపై కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు,ఎంపీలు స్పందించాలి


లేనిపక్షంలో కేసీఆర్ ఫామ్ హౌస్ ముట్టడిస్తాం

జిఎం ఆఫీస్ ముందు జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా


జిఎం సంజీవరెడ్డి కి సమ్మె నోటీస్ ఇచ్చిన జేఏసీ నాయకులు


12వ నుంచి నిరవధిక సమ్మె...



సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెపై కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు,ఎంపీలు తక్షణమే స్పందించాలని,లేనిపక్షంలో కేసీఆర్ ఫామ్ హౌస్ ముట్టడిస్తామని ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి బోగే ఉపేందర్,ఐ.ఎఫ్.టి.యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దుర్గం బ్రహ్మానందం, హెచ్.ఎం.ఎస్.రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.రాజబాబు,సీఐటీయూ ఏరియా కార్యదర్శి ఓదెలు లు హెచ్చరించారు,మంగళవారం రోజున సింగరేణి జేఏసీ ఆధ్వర్యంలో జిఎం కార్యాలయం ముందు ధర్నా చేసి,ఏరియా జనరల్ మేనేజర్ సంజీవరెడ్డికి వినతిపత్రం ఇచ్చారు,ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు,యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికులకు,డ్రైవర్లకు కోల్ ఇండియా వేతనాలు చెల్లించకూడా సింగరేణి యాజమాన్యం శ్రమదోపిడికి గురిచేస్తుందని,దాని వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని,సమాన పనికి సమాన వేతనం చెలించాలని,గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, హై పవర్ కమిటీ వేతనాలు కాంట్రాక్ట్ కార్మికులకు,డ్రైవర్లకు చెల్లించాలని సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు,8గంటల పని విధానాన్ని కొనసాగించాలని అన్నారు, సంస్థకు వేళా కోట్ల లాభాలు రావడంలో కాంట్రాక్ట్  కార్మికులు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు కార్మికులకు యాజమాన్యం గత 4 సంవత్సరాల CMPF వివరాలు చెప్పాలని,అలాగే వారితో పాటు కుటుంబసభ్యులకు కార్పొరేట్ వైద్యసదుపాయం కల్పించాలని, సంస్థకు వచ్చిన లాభాల్లో వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు,యాజమాన్యం డ్రైవర్లకు  తక్కువ వేతనాలు ఇస్తూ శ్రమదోపిడి గురిచేస్తున్నారని అన్నారు, డ్రైవర్స్,ఓబీ కార్మికుల ఈ నెల 12వ తేదీ జరిగే నిరవధిక సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు,

ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు చల్లూరి అశోక్,రాయిల్లా నర్సయ్య,సాగర్ గౌడ్,పొశం,చంద్రయ్య,నారాయణ,సంతోష్,సురేష్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు