డెవలప్‌పెంట్‌ ఛార్జీలుబిల్లులో ఉన్నాయి

 

వినియోగదారులు వాటిని గుర్తిం చకనే సమస్య

విద్యుత్‌ వినియోగం పెరుగడంతో లోడ్‌ ఛార్జీలు తప్పవు
డెవలప్‌మెంట్‌ ఛార్జీలపై అధికారుల వివరణ
కామారెడ్డి,ఫిబ్రవరి21(జ‌నంసాక్షి): ప్రతీ నెల వినియోగదారుడికి ఇచ్చే విద్యుత్‌ బిల్లుల కింద డెవలప్‌మెంట్‌ చార్జీలు ఉంటాయని కామారెడ్డి ఎస్‌ఈ శేషాద్రి అన్నారు. ఇది వినియోగదారులు గమనించకపోవడంతోనే సమస్యని అన్నారు. అయితే వంద కిలోవాట్ల లోడ్‌కు గృహ వినియోగదారుడు చెల్లించేది రూ.1 లక్ష 50 వేలు మాత్రమే అయితే ఒక కిలోవాట్‌ లోడ్‌ను కొత్తగా ఉత్పత్తి, టవర్ల ద్వారా ప్రచారం చేసి, లోకల్‌లైన్లు,
సబ్‌స్టేషన్‌, ట్రాన్స్‌ఫార్మర్‌ ద్వారా పంపిణీ చేయాలంటే విద్యుత్‌ సంస్థకు రూ.10వేల వరకు ఖర్చు అవుతుంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుంటే ప్రస్తుతం డెవలప్‌మెంట్‌ చార్జీల కిందట వినియోగదారులు చెల్లించేది కేవలం 20 శాతం మాత్రమే అని అన్నారు. ఈ డెవలప్‌మెంట్‌ చార్జీలు ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత ఈ చార్జీలు రావు. దీనికి వినియోగదారులు సహకరించాలని శేషాద్రి అన్నారు. ఇటీవల కామారెడ్డి పట్టణంలోని పలు ప్రాంత వాసులకు సుమారు రూ.5వేల నుంచి 10 వేల వరకు బిల్లులు రావడంతో వినియోగదారులు షాక్‌కు గురయ్యారు. అసలు ఏమిటీ ఈ డెవలప్‌మెంట్‌ చార్జీలు అంటూ ఆరా తీస్తున్నారు. సాధారణంగా వినియోగదారుడు విద్యుత్‌ కనెక్షన్‌ పొందే సమయంలో వాడుతున్న సామర్థ్యం బట్టి, లేని పక్షంలో సదరు వినియోగదారుడు కోరుకున్న లోడ్‌తో విద్యుత్‌ అధికారులు సర్వీస్‌ కనెక్షన్‌లు మంజూరు చేస్తారు. దీన్నే ఒప్పంద లోడ్‌ అంటారు. ఎప్పుడో ముప్పై, నలబై ఏళ్ల కిందట తీసుకున్న వారు 240 వాట్ల ఒప్పందం లోడ్‌తో సర్వీస్‌ కనెక్షన్‌లు పొందారు. కాలనుగుణంగా వినియోగదారుడు ఉపయో గించే విద్యుత్‌ పరికరాల సంఖ్య పెరగడం వల్ల గాని లేని పక్షంలో వాటి సామర్థ్యం పెరగడం వల్ల మంజూ రైన లోడ్‌ కంటే అదనపు లోడ్‌ పడుతుంది. ఇలా అదనంగా పెరిగిన లోడ్‌ కోసం సెక్యూరిటీ డిపాజిట్‌ కింద చార్జీలు వసూలు చేసి ఆ సర్వీసు కనెక్షన్‌ లోడ్‌ను పెంచినట్లుగా గుర్తిస్తారు. ప్రస్తుతం కొత్తగా ఇళ్లు నిర్మించు కునే వారు సర్వీస్‌ కనెక్షన్‌ తీసుకున్నప్పుడే ఇంట్లో ఈ పరికరాలను దృష్టిలో పెట్టుకుని 2 కిలోవాట్ల ఒప్పందం లోడ్‌ను పొందడం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ సమస్యను శాశ్వత ప్రాతిపాది కన పరిష్కరించేందుకు ఈ డెవలప్‌చార్జీలు వసూలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అధికలోడ్‌ పెరిగినప్పుడు మరో కొత్త వంద కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయాల్సి వస్తుందని ఈ సెక్యూరిటీ డిపాజిట్‌ వినియోగదారుని అకౌంట్‌లోనే ఉంటుందని వారు పేర్కొంటున్నారు. ఒక 100 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ విూద దాదాపు 70 నుంచి 100 ఇళ్లకు కనెక్షన్‌ ఇస్తారు. ఇంటి విూటర్‌కు లోడ్‌ ఒక కిలోవాట్‌ మంజూరు తీసుకుని ఉండి వినియోగం కూడా అదేస్థాయిలో ఉంటే ఇబ్బంది ఎదురు కాదు. ఇంట్లో అవసరాల రీత్యా విద్యుత్‌ పరికరాల వినియోగంతో లోడ్‌ అమాంతంగా పెరుగుతుంది. అప్పుడు ఒక ట్రాన్స్‌ఫార్మర్‌పై విద్యుత్‌ కనెక్షన్‌ల సంఖ్య 30 నుంచి 40 వరకు తగ్గించాల్సి వస్తోంది. లేని పక్షంలో పెరిగిన లోడ్‌తో సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్‌శాఖ అధికారుల వాదనగా ఉంది. అయితే డెవలప్‌మెంట్‌ చార్జీలంటూ అధిక బిల్లులు వసూలు చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. విద్యుత్‌ అధికారులు ఈ తరహాలో వసూలు చేయడం దారుణంగా ఉందన్నారు. పేద, మధ్య తరగతి వారికి ఏకంగా ఇంత బిల్లు కట్టాలంటే ఎక్కడి నుంచి తీసుకువస్తారని అన్నారు.
`````````````