అఖిల్ ఆలోచనలు అభినందనీయం - ఎన్నారై జలగం సుధీర్


మునగాల, ఫిబ్రవరి 11(జనంసాక్షి): జాతీయస్థాయి ఇన్ స్పైర్ పోటిల్లో మునగాల ప్రభుత్వ పాఠశాల విద్యార్ది అఖిల్ ఎంపిక కావటంతో సామాజిక కార్యకర్త జలగం సుధీర్ వెల్లి కలిసి అభినందనలు తెలపటం జరిగింది. కొబ్బరి బోండం నుండి నీరు తీసే పరికరం తయారు చేసినందుకు సుర్యాపేట్ జిల్లా నుండి అఖిల్ జాతీయ స్తాయిలో గుర్తింపు పొందాడు. భవిశ్యత్ లో మరిన్ని రీసేర్చ్, ప్రయోగాలు చేయాలని రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం ఆద్వర్యం లో నడుస్తున్న ఇన్నోవేషన్ హబ్ ల నుండి అవసరం అయిన పేపర్ వర్క్ లో సూచనలు చేయటానికి జలగం సుధీర్ ముందుకు వచ్చారు. కె.టి.ఆర్ అలోచనతో నడుస్తున్న ట్-హబ్ లో ఇప్పటికే కొన్ని వందల కంపనీలకు, వ్యక్తులకు ప్రొత్సాహం లభించిందని సుధీర్ తెలిపారు. కోదాడ ప్రాంతానికే చెందిన మరొక వ్యక్తి సందీప్ శర్మ ఫొర్బ్స్ 30లో స్థానం సంపాదించి కెటీఅర్ ప్రశంసలు అందుకున్నాడని గుర్తు చేశారు. అఖిల్ కు ప్రోత్సాహం అందించిన ఉపాద్యాయుడు జాఫర్ కు కూడ క్రుతజ్ఞతలు తెలపటం జరిగింది. అదే సమయంలో 9 మరియు 10 తరగతి విద్యార్దులకు డయల్ 100, ఆర్ధిక క్రమశిక్షణ, భవిశ్యత్ అవకాశాల మీద అవగాహన కల్పించటం జరిగింది.