యూపిలో మరోమారు బిజెపికే అధికారం


సర్వే అంచనాలన్నీ కమలానికి అనుకూలం

అన్ని రాష్టాల్ల్రోనూ నిరుద్యోగుల ప్రభావం
న్యూఢల్లీి,ఫిబ్రవరి8( (జనం సాక్షి)): ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ రెండోసారి అధికారాన్ని చేపడుతుందని వస్తున్న సర్వేలు బిజెపి శిబిరంలో ఉత్సాహాన్ని నింపుతోంది. బిజెపి కూడా ఇక్కడ మరోమారు అధికారంలోకి రావాలని కోరుకుంటోంది. మిగతా రాష్టాల్రు ఎలా ఉన్నా యూపి చేజారకుండా చూసుకుటోంది. అయితే అన్ని రాష్టాల్ల్రో నిరుద్యోగం ప్రధాన పాత్ర పోషఙంచబోతోంది. నిరుద్యోగ యువత గణనీయంగా పెరిగింది. వీరి ఓటు ఎటు అన్నది ఆసక్తిగా ఉంది. ఈ క్రమంలో వీరు నిర్ణయాత్మకంగా మారనున్నారు. యూపిలో శాంతిభద్రతలుకూడా ప్రభావం చూపనున్నాయి. యూపీలో 403 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ ఈ సారి కొన్ని సీట్లు కోల్పోయినా.. మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటి 225`237 సీట్లు సాధిస్తుందని ఈ సర్వే అంచనా వేసింది. ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌లో హంగ్‌ అసెంబ్లీ కొలువు దీరనుందని ఏబీపీ`సీవోటర్స్‌ ఒపీనియన్‌ పోల్‌ సర్వే స్పష్టం చేసింది. పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) హవా ఉంటుందని వెల్లడిరచింది. సమాజ్‌వాదీ పార్టీ(ఎ?సపీ) గతంలో కంటే కొంత మెరుగ్గా 139`151 సీట్లను సాధిస్తుందని, బీఎస్పీకి 13`21 సీట్లే వస్తాయని, కాంగ్రెస్‌ 4`8 స్థానాలకు పరిమితమవుతుందని పేర్కొంది. పంజాబ్‌లో 117 స్థానాలకు గాను..
ఆప్‌ 55`63 సీట్లలో పాగా వేస్తుందని, కాంగ్రెస్‌ 24`30 సీట్లతో రెండో స్థానంలో నిలుస్తుందని, శిరోమణి అకాలీదళ్‌కు 20`26 సీట్లు, బీజేపీకి 3`11 స్థానాలు దక్కుతాయని ఈ సర్వే వెల్లడిరచింది. ఉత్తరాఖండ్‌లో 70 సీట్లకు గాను మేజిక్‌ ఫిగర్‌(36) అవకాశాలు బీజేపీ, కాంగ్రెస్‌కు ఉన్నాయని ఏబీపీ`సీవోటర్స్‌ సర్వే అంచనా వేసింది. బీజేపీకి 31`37 స్థానాలు, కాంగ్రెస్‌కు 30`36, ఆప్‌కు 2`4 సీట్లు వస్తాయని పేర్కొంది. మణిపూర్‌లో 60 అసెంబ్లీ స్థానాలుండగా.. బీజేపీకి 21`25 సీట్లు, దాని మిత్రపక్షం నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌(ఎన్‌పీఎఫ్‌)కు 6`10 సీట్లు వస్తాయని తెలిపింది. గోవాలోనూ హంగ్‌ అసెంబ్లీ తప్పదనిఒపీనియన్‌ పోల్‌ సర్వే అంచనా వేసింది. 40 స్థానాలకు గాను బీజేపీ మ్యాజిక్‌ ఫిగర్‌ను సాధించలేదని, ఆ పార్టీకి 14`18 సీట్లు వస్తాయని తెలిపింది. అయితే పంజాబ్‌లో అమరీందర్‌ పార్టీతో గట్టెక్కాలనుకున్నా ఆప్‌ దెబ్బ కొడుతుందని అంటున్నారు. అక్కడ నిరుద్యొగం బాగా ప్రభావంచూపనుంది. అప్పాయింట్‌మెంట్ల సమయంలో ఆగిపోయి, కోర్టుల్లో కేసు విచారణల కోసం ఎదురుచూస్తూ వుండిపోవడం ఎక్కువవుతుండడం వల్లే పంజాబ్‌లో ప్రస్తుతం లక్షా 30వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా వున్నాయి. విద్యా శాఖలో అధికంగా 19,300 ఖాళీలు వున్నాయి. ఆ తర్వాత పోలీసు, ఆరోగ్య శాఖల్లో వున్నాయి. 23 ఏళ్ల గ్యాప్‌ తర్వాత ప్రభుత్వ కాలేజీల్లో 1158 పోస్టుల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల రిక్రూట్‌మెంట్‌కి ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీనికి విధించిన నిబంధనలు వివాదాస్పద మయ్యాయి. దాంతో అభ్యర్థులు కోర్టుకెళ్లారు. దీనిపై ఈ నెల 17న విచారణ జరగాల్సి వుంది. మహిళలకు రిజర్వేషన్‌ నిబంధనల అమల్లో యూనివర్శిటీల పక్షపాత వైఖరిని కూడా ఉద్యోగార్థులు ప్రశ్నిస్తున్నారు. ఎస్‌సిలకు 25శాతం, ఇతర వెనుకబడిన తరగతులకు 12శాతం, మహిళలకు 33శాతం రిజర్వేషన్‌ తప్పనిసరని ప్రభుత్వ రిజర్వేషన్‌ విధానం పేర్కొంటోంది. ఎస్‌సి, ఎస్‌టిలకు చెందిన మహిళలైతే వారికి మహిళల రిజర్వేషన్‌ ప్రయోజనాలే అందజేయడాన్ని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా అన్ని రాష్టాల్ల్రోనూ నిరుద్యోగం ప్రధానంగా ప్రభావం చూపనుంది.