ఎమ్మెల్యే కిశోర్‌ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరిక

సూర్యాపేట,ఫిబ్రవరి11(జనం సాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆకర్షితులవుతున్నారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్‌ సమక్షంలో ఏనేకుంట తండాకు చెందిన బానోతు సుందర్‌, రామచంద్ర, బిచ్చా, సర్వన్‌తో పాటు మరో 50 మంది కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వీరందరికి ఎమ్మెల్యే కిశోర్‌ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సీఎం కేసీఆర్‌కు అండగా ఉంటామని బానోతు సుందర్‌ చెప్పారు. పేదల సంక్షేమం కోసం కేసీఆర్‌ అహర్నిశలు కృషి

చేస్తున్నారని కొనియాడారు.