దేశానికి ఆదర్శంగా కెసిఆర్‌ పథకాలు


రైతుబంధు అమలే ఇందుకు నిదర్శనం:ఎమ్మెల్యే

నిజామాబాద్‌,ఫిబ్రవరి8  (జనం సాక్షి) : సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అర్బన్‌ ఎమ్మెల్యే బీగాల గణెళివ్‌ గుప్తా అన్నారు. ఇటీవల కేంద్రం ప్రవేశ పెట్టిన రైతుబీమా పథకమే ఇందుకు నిదర్శనమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుబంధు లాంటి పథకం,మిషన్‌ భగీరథపథకాలనుకాపీ కొడుతోందని అన్నారు. కేంద్రానికి రైతులపై చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సాయం కన్నా ఎక్కువ ఇవ్వాలన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు సీఎం కేసీఆర్‌ వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నారన్నారు. గతంలో రూ.లక్ష పంట రుణాలను మాఫీ చేశారని గుర్తుచేశారు. మరోసారి రూ.లక్ష రుణం మాఫీ చేస్తామని చెప్పారు. పంట పెట్టుబడి కోసం ఎకరాకు రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హావిూ మేరకు ఆర్థిక సాయాన్ని రూ.10 వేలకు పెంచారని, రైతుబంధు పథకాన్ని అన్ని రాష్టాల్రు స్వాగతిస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు పథకం గురించి సర్వత్రా చర్చించడం కేసీఆర్‌కు దక్కిన గౌరవం అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలను కూడా ప్రోత్సహించి ఉపాధి పెంపొందించేందుకు కృషిచేస్తున్నామన్నారు. తెలంగాణలోని అన్ని గ్రామాలకు మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోందని.. అందుకే గ్రామాలన్నీ దేశానికి ఆదర్శంగా నిలిచాయని బీగాల స్పష్టం
చేశారు. ప్రతి గ్రామానికి కోట్ల కొద్ది నిధులు వచ్చాయి. గతంలో మంచినీరుకు కూడా గతి లేదు. వచ్చే మార్చి నుంచి స్థలాలు ఉన్న అర్హులైన వాళ్లకు ఇండ్లు ఇస్తున్నాం. వచ్చే మూడేండ్లలో దళితులు అందరికీ దళిత బంధు ఇస్తాం. రాజ్యాంగాన్ని సవరించాలనడం నేరం కాదు. కావాలని కొందరు కల్పిత వివాదం సృష్టిస్తున్నారు. అలాంటి వాటిని టీఆర్‌ఎస్‌ శ్రేణులు తిప్పి కొట్టాలన్నారు.టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి.. దుష్పచ్రారం చేస్తున్న వాళ్లను నిలదీయాలి.. అని స్పష్టం చేశారు. రాజ్యాంగం వల్ల ప్రజలకు మేలు జరగాలన్నదే కెసిఆర్‌ లక్ష్యమన్నారు. రైతుల వ్యతిరేక చట్టాలు తెచ్చి, తోక ముడిచిన బిజెపి చేస్తున్న విమర్శలను ప్రజలు పట్టించుకోరని అన్నారు. తెలంగాణ పట్ల కేంద్రం మొండిగా వ్యవహరిస్తున్నది. అయినా సీఎం కేసీఆర్‌ ఎంతో అద్భుతంగా అభివృద్ధి, సంక్షేమాన్ని శ్రద్ధగా నిర్వహిస్తున్నారు. కనీవినీ ఎరగని రీతిలో మన రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నదని వివరించారు.