కోటి ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యం

ధోనిగామ్‌ ప్రాజెక్ట్‌ పనులు ప్రారంభించిన మంత్రి

నిర్మల్‌,,ఫిబ్రవరి23  (జనంసాక్షి) :  తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. చివరి ఆయకట్టుకు సాగునీరు అందేలా ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుదని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని సారంగాపూర్‌ మండలంలో రూ. 12.05 కోట్ల వ్యయంతో చేపట్టిన ధోనిగాం ప్రాజెక్ట్‌ ఆధునీకరణ పనులను బుధవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆయకట్టు చిట్టచివరి ఎకరానికి సాగు నీరందివ్వాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ జలాశయాల నిర్మాణం, ఆధునీకరణ పనులకు పెద్దపీట వేస్తూ నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. ఈ ప్రాజెక్ట్‌ ఆధునీకరణకు నిధులు మంజూరు కావడంతో ఈ ప్రాంత ప్రజల సాగునీటి కష్టాలు తీరనున్నాయని చెప్పారు. నిధులు మంజూరు కావడంతో టెండర్లు పూర్తి చేసి
ఇవాళ పనులు ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.