నాయకులు, కార్యకర్తలు వైసీపీ చేస్తున్న ప్రలోభాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి.

.


పాడేరు నియోజకవర్గం ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి.

 జి.మాడుగుల. ఫిబ్రవరి 21 .జనం సాక్షి. మండలంలో బీరం పంచాయతీ అనర్బ గ్రామంలో సోమవారం నాడు నియోజకవర్గం ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో ఆత్మగౌరవ సభ నిర్వహించారు..ఈ ఆత్మగౌరవ సభలో ఆమె మాట్లాడుతూ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను,ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలకు వివరిస్తూ, చంద్రబాబు నాయుడు హయాంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి అవగాహన కల్పించాలని సూచించారు,ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయటానికి మనమంతా కష్టపడాలని, వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అక్రమ అవినీతిపై ప్రజలకు వివరించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలందరూ  సైనికుల్లా  కష్టపడి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలని  ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు సోమెలి చిట్టిబాబు, మండల పార్టీ అధ్యక్షుడు వి.కొండలరావు, కార్యదర్శి కల్యాణం, కొండబాబు, భీంబాబు ,నాగబ్బాయి, పి. కృష్ణమూర్తి,వి. రామ్మూర్తి నాయుడు,ఎల్. రామకృష్ణ,ఎం. లక్ష్మయ్య,ఎస్. రమణబాబు,ఎం, రత్నకుమారి, కె.చిరంజీవి. మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.