రాష్ట్రపతిని కలిసిన నిర్మలా సీతారామన్‌


బడ్జెట్‌కు కేంద్ర కేబినేట్‌ ఆమోదం

న్యూఢల్లీి,ఫిబ్రవరి1 (జనం సాక్షి):  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను మంగళవారం ఉదయం కలిశారు. బడ్జెట్‌ అంశాలను రాష్ట్రపతికి వివరించారు. ఆమె వెంట కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రులు డా. భగవత్‌ కిషన్‌రావ్‌ కారడ్‌?, శ్రీ పంకజ్‌ ఛౌదరీ ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. కేంద్ర మంత్రివర్గం సమావేశమై.. 2022`23 బడ్జెట్‌ను ఆమోదించింది. బడ్జెట్‌కు ముందు రాష్ట్రపతిని కలవడం, కేబినేట్‌ ఆమోదించడం లాంఛనంగా వస్తున్న ఆచారం.పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి 2022`23 బడ్జెట్‌ ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పెట్టారు. రెండవ సారి డిజిటల్‌గా.. మొత్తంగా నాల్గవ సారి ఆమె బడ్జెట్‌ ను ప్రవేశపెడుతున్నారు. 2023 ఆర్థిక సంవత్సరంలో మొత్తం బ్జడెట్‌ అంచనాలు రూ.39 లక్షల కోట్లుగా ఆమె పేర్కొన్నారు. సుమారు రెండున్నర గంటల పాటు బడ్జెట్‌ ప్రసంగం జరిగింది. బడ్జెట్‌ పై ఎంతో ఆశగా ఎదురు చూసిన పన్ను చెల్లింపు దారులకు మొండి చేయే ఎదురైంది. ఆదాయపు పన్ను శ్లాబుల్లో కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదు. పన్ను దాఖలుకు సంబందింఛి అప్‌డేట్‌ చేసుకునేందుకు రెండేళ్ల సమయం మాత్రమే ఇచ్చింది. రిటర్న్స్‌ విషయంలో లోపాల సవరణకు అవకాశముంది. కరోనా దేశ ఆర్థిక వ్యవస్ధ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో ఈ బడ్జెట్‌ కీలకం కానుంది. అన్ని రంగాల వారు.. ఈ బ్జడెట్‌పై ఆశలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి కూడా డిజిటల్‌ రూపంలో బడ్జెట్‌ ను ప్రవేశపెట్టారు. ఇప్పటికే ఈ బడ్జెట్‌ కు కేంద్ర క్యాబినేట్‌ ఆమోదం తెలిపింది. మంగళవారం ఉదయం ఎరుపు రంగు రెడ్‌ కవర్‌లో జాతీయ చిహ్నంతో కూడిన టాబ్లెట్‌ను తీసుకుని.. పార్లమెంటుకు బయలు దేరారు.