యాదాద్రి నిర్మాణం అద్భుతం కెసిఆర్‌కు మాª`తరమే సాధ్యం: రోజా


యాదాద్రి,ఫిబ్రవరి12(జనం సాక్షి ): యాదాద్రి ఆలయాన్ని సీఎం కేసీఆర్‌ అద్బుతంగా నిర్మాణం చేస్తున్నారని నగిరి ఎమ్మెల్యే రోజా కొనియాడారు. ఇంత అద్భుతంగా ఈ కాలంలో నిర్మించడం అరుదైన విషయమన్నారు. శనివారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి రోజా దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే విూడియాతో మాట్లాడుతూ ఈ కాలంలో ఏవరికి దక్కని అవకాశం కేసీఆర్‌కు దక్కిందన్నారు. రెండు తెలుగు రాష్టాల్ర ప్రజలు సంతోషించే విధంగా ఆలయం నిర్మాణం జరిగిందని తెలిపారు. ఇక్కడికి తీసుకువచ్చిన రాయి గుంటూరు నుంచి తీసుకు వచ్చారని, ఎప్పటికీ తెలుగువారు అన్నదముళ్ళు, అక్కచెల్లెలుగా కలిసి ఉంటారని రోజా స్పష్టం చేశారు.