ఎడాపెడా విద్యుత్‌ కోతలతో ఇక్కట్లు

 నష్టాల ముసుగులో ప్లాంట్ల ప్రైవీటీకరణ

మండిపడుతున్న లెఫ్ట్‌ పార్టీల నేతలు
విజయవాడ,ఫిబ్రవరి21 : ఒక్కోసారి విద్యుత్‌ సరఫరాలో హెచ్చుతగ్గుల వల్ల గృహోపకరణాలు పాడైపోతున్నాయి. కొవిడ్‌ ప్రభావంతో ఇంటినుంచే పని చేస్తున్న సాప్ట్‌వేర్‌ ఉద్యోగులు కరెంట్‌ కోతలతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అనధికార విద్యుత్‌ కోతలపై వినియోగదారులు విద్యుత్‌ కార్యాలయాలకు, ఫీజ్‌ కాల్‌ ఆఫీసుకు ఫోన్‌చేసినా సరైన సమాధానం రావడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. గ్రావిూణ ప్రాంతాల్లో రోజూ 2 నుంచి 3 గంటలపాటు విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు.పగలు, రాత్రి అనే తేడా లేకుండా
అనధికార విద్యుత్‌ కోతను విధిస్తున్నారు. పగటిపూట నాలుగైదు దఫాలే కాకుండా రాత్రి 10గంటలలోపు రెండు గంటలపాటు విద్యుత్‌ కోత ఉంటోందని ప్రజలు వాపోతున్నారు. పేదలకు విద్యుత్‌ సబ్సిడీ ఎత్తివేయాలనే దుర్మార్గపు కుట్ర ఇందులో దాగి వుందని లెఫ్ట్‌ పార్టీలు ఆరోపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం మేరకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ పంపులకు విద్యుత్‌ విూటర్లు ఇప్పటికే రాష్ట్రమంతా బిగిస్తున్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ రాబోయే కాలంలో ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం విూటర్లు బిగించినా ప్రభుత్వమే విద్యుత్‌ ఛార్జీలు భరిస్తుందనే మాటలు ఎంతో కాలం చెల్లవు. విద్యుత్‌ ఉత్పత్తి చేసే జెన్‌కోలు, డిస్కంల ప్రయివేటీకరణ జరిగితే దాని దుష్ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ ప్రయివేటీకరణ విధానాలను విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఇదిలావుంటే నెల్లూరు జిల్లాలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ అత్యాధునికమైన సూపర్‌ క్రిటికల్‌ సాంకేతిక నైపుణ్యంతో నడుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని జెన్‌కో సంస్థ ఆధ్వర్యంలో 1600 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తున్నది. మరో 800 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో యూనిట్‌`3 నిర్మాణం 90 శాతం పూర్తి అయ్యింది. రూ.21 వేల కోట్లు పెట్టుబడి వ్యయంతో 1490 ఎకరాల్లో నిర్మించిన ఈ థర్మల్‌ ప్లాంటులో ఇంజనీర్లతో సహా అన్ని రకాల కార్మికులు 1810 మంది పనిచేస్తున్నారు. థర్మల్‌ ప్లాంటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు చౌకగా భూములిచ్చి త్యాగం చేశారు. ఇటువంటి భారీ కీలకరంగ పరిశ్రమను ప్రయివేటుకు 25 సంవత్సరాలకు లీజుకు ఇవ్వాలని రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయించడం...స్థానిక ప్రజలు, కార్మికులు, రాష్ట్ర ప్రయోజనాలకు పూర్తి వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం థర్మల్‌ ప్లాంటును అదానీ గ్రూపుకి అప్పగించాలనే నిర్ణయం చేసిందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కృష్ణపట్నం పోర్టును సొంతం చేసుకున్న ’అదానీ గ్రూపు’నకు ఇప్పుడు థర్మల్‌ ప్లాంటుపై కన్నుపడిరది. చుట్టూ అనేక ప్రయివేటు థర్మల్‌ ప్లాంట్లు ఉన్నా, లాభాలు బాగా వచ్చే దామోదరం సంజీవయ్య పవర్‌ ప్లాంట్‌నే కైవసం చేసుకోవ డానికి ఉత్సాహం చూపిస్తున్నట్లుసమచారం. దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ స్టేషన్‌కు నష్టాలు వస్తున్నాయనే పేరుతో ప్రయివేటుకు అప్పగించాలనడం దారుణం అని ప్రజలు, విపక్షాలు విమర్శిస్తు న్నాయి. అత్యంత ఆధునికమైన థర్మల్‌ ఎª`లాంటును కారుచౌకగా ప్రయివేటుకు కట్టబెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని మండిపడుతున్నారు. మొదట ఈ థర్మల్‌ ప్లాంట్‌ను ప్రయివేటుకు ఇచ్చి, ఆ తర్వాత విజయవాడ, ఆర్‌టిపిపి ప్లాంట్లనూ ప్రయివేటుపరం చెయ్యాలన్నది సర్కారు యోచనగా వుంది. ఇకపై ప్రైవేటు థర్మల్‌ ప్లాంట్లు ఇంకా యూనిట్‌ ఛార్జీలు పెంచడం ఖాయమని అంటున్నారు. దానివల్ల రాష్ట్ర ప్రజలపై విద్యుత్‌ భారాలు పడతాయి. రాష్ట్రంలో మూడు డిస్కంలకు గత సంవత్సరం రూ.10045.61 వేల కోట్లు నష్టాలు వచ్చాయి. విద్యుత్‌ చార్జీలు పెంచాలని ఈ సంవత్సరం డిస్కాంలు ఇఆర్‌సి ముందు ప్రతిపాదించాయి. రాష్ట్ర ప్రభుత్వం బొగ్గు కొరతను సృష్టించి నష్టాలు వస్తున్నాయని నెపం వేస్తున్నదని టిడిపి ఆరోపిస్తోంది. ప్రభుత్వం తరపున డిస్కంలు ఇచ్చే ఆర్డర్‌ను బట్టి విద్యుత్‌ ఉత్పత్తి చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ ప్రయివేటీకరణ విధానాల్లో భాగంగా జెన్‌కోలో అత్యంత అధునాతన మైన శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ ప్లాంటును ప్రయివేటుకు అప్పజెప్పాలనే నిర్ణయానికి వచ్చింది. ఒకవైపు అత్యంత ఎక్కువ ధరలకు బయట ప్రయివేటువారి నుండి విద్యుత్‌ను కొంటూ...రాష్ట్ర ప్రభుత్వం చేతిలోని ఒక భారీ విద్యుత్‌ కర్మాగారాన్ని ప్రయివేటుకు అప్పజెప్పడం వల్ల...ప్రజలపై రాబోయే కాలంలో భారాలు తీవ్రంగా పడతాయి.