స్పందనకు వందనంమహబూబాబాద్ బ్యూరో ఫిబ్రవరి 10 (జనం సాక్షి)

ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అధికారులు మొద్దు నిద్ర పోతున్నారని ప్రజల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్న క్రమంలో... జనం సాక్షి దినపత్రిక లో ప్రచురితమైన "గార్ల లో ఇసుక దందా కు తిరుగులేదు"అనే ప్రత్యేక కథనానికి స్పందించిన రెవెన్యూ అధికారులు బుధవారం రాత్రి మండల పరిధి మద్దివంచ ఏరియాలో అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు.పై అధికారుల సూచన మేరకు గార్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు.దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.చీకటి దందాను బట్టబయలు చేసిన వెలుగులోకి తీసుకువచ్చిన  జనం సాక్షి పత్రిక ప్రతినిధికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుంది.