ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ
హైదరాబాద్: ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను మోదీ సందర్శించారు. ప్రధానిని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ జాక్వెలిన్ డి ఆరోస్ సన్మానించారు. ఇక్రిశాట్ పరిశోధనలు పురోగతిపై ప్రధానికి శాస్త్రవేత్తలు వివరించారు. సజ్జ, కంది, సెనగ, వేరుసెనగ, ఇతర చిరుధాన్యాలు విత్తన రకాలు, నాణ్యతపై ప్రధాని తెలుసుకున్నారు. కొత్త వంగడాల రూపకల్పన, రైతులకు చేరవేస్తున్న తీరుపై వివరించారు. ప్రధాని వెంట కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, నరేంద్రసింగ్ తోమర్, తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై ఉన్నారు.