కోల్‌స్కామ్‌పై మోసీ సర్కార్‌ మౌనం

50వేల కోట్ల దోపిడీని పట్టించుకోని కేంద్రం

కెసిఆర్‌ అవినీతి వెనక సిఎండి శ్రీధర్‌ చర్యలు

మోడీని బలోపేతం చేసే దిశగా కెసిఆర్‌ నిర్ణయాలు

కెసిఆర్‌ అవినీతిపై మోడీ సైలెంట్‌ వెనక కారణమిదేనా

జగ్గారెడ్డికి తామంతా అండగా ఉంటామన్న రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌,ఫిబ్రవరి21(జ‌నంసాక్షి): రాష్ట్రంలో జరుగుతున్న కోల్‌ స్కాంపై మోడీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను ప్రధానికి.. కోల్‌ ఇండియాకి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. డీవోపీటీ నిబంధనలకు విరుద్ధంగా శ్రీధర్‌ ని సీఎండీగా కొనసాగిస్తున్నారని రేవంత్‌ ఆరోపించారు.  50 వేల కోట్ల దోపిడీకి పాల్పడుతోందదని, ప్రధాని, కోల్‌ సెక్రెటరీలకు ఫిర్యాదు చేసిని పట్టించుకోవడం లేదన్నారు. ప్రధానికీ, కేసీఆర్‌కీ ఎంత అనుబంధం ఉందో దీనిని బట్టి అర్దం చేసుకోవచ్చన్నారు.  సోమవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ శ్రీధర్‌ నిర్ణయాలతో జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. ప్రైవేట్‌ కాంట్రాక్టర్‌ లకు లబ్ది చేకూర్చే ప్రయత్నం చేశారు. టెండర్‌ అయ్యాక టెండర్‌ దారుడు ఇంకో పెట్టుబడి దారున్ని తెచ్చుకోవచ్చు 

అని నిబంధన పెట్టారని మండిపడ్డారు. కేసీఆర్‌`మోడీకి అసలు పడనప్పుడు సింగరేణి సంస్థ అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు.  అదాని దగ్గర కరెంట్‌ కొనాలని మోడీ ఒత్తిడి పెంచుతున్నారని కేసీఆర్‌ చెప్తున్నారు. మరి సింగరేణి బొగ్గును అదానీకి కట్టపెడుతుంటే నీకు కనిపించడం లేదా..? అని రేవంత్‌ ప్రశ్నించారు. భూగర్భ గనులను కేసీఆర్‌ కుటుంబం దోచేస్తోందన్నారు. కేంద్రం ఎందుకు నివేదిక అడగలేదని నిలదీసారు. కేంద్రం సైలెంట్‌ గా ఉంది అంటే మోడీ` కేసీఆర్‌ అవినీతికి మద్దతు ఇస్తున్నట్టు కదా..? కెసిఆర్‌ దోపిడీ కి పాల్పడితే? జైలుకు పంపిస్తా అంటున్న సంజయ్‌..కిషన్‌ రెడ్డికి సవాల్‌ విసురుతున్నారు. మేము ఫిర్యాదులు చేసినా ఎందుకు విచారణ చేయడం లేదు.. సింగరేణి సిఎండి శ్రీధర్‌ విూద తీవ్ర విమర్శలు ఉన్నప్పుడు కేంద్రం ఎందుకు స్పందించడం లేదని రేవంత్‌ రెడ్డి అన్నారు.  దీని వెనక..మోడీ..కేసీఆర్‌ కి ఉన్న చీకటి వ్యవహారం ఏంటన్నది బయటపడాలన్నారు. కేసీఆర్‌ యూపీయేను బలహీన పర్చి ఎన్డీయేని పెంచే పనిలో ఉన్నారు. మోడీ దగ్గర కేసీఆర్‌ సుపారీ తీసుకున్నాడని రేవంత్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌కి అనుబంధంగా ఉండే పార్టీలతో కలిసి యూపీయేని బలహీనపరిచే పనిచేస్తు న్నారు. దేవెగౌడ నాకు సహకరిస్తున్నారు అని కేసీఆర్‌ చెప్పారు. కానీ కేసీఆర్‌తో వ్యక్తిగత పనుల విూద మాట్లాడినా అని చెప్పారు. శరద్‌ పవార్‌ ఏమో తెలంగాణ..మహారాష్ట్ర అభివృద్ది చర్చ చేశాం అని ట్వీట్‌ చేశారు. మహారాష్ట్ర సీఎంవో రెండు రాష్టాల్ర మధ్య జల వివాదం?పరిశ్రమ వివాదంపై చర్చించాను అని ట్వీట్‌ చేశారు. సుప్రియ సులే కూడా అభివృద్ధి పైనే చర్చ చేశాం అని ట్వీట్‌ చేశారు. కేసీఆర్‌ కూటమి గురించి ఎక్కడ మాట్లాడలేదు అని వాళ్ళు పోస్ట్‌ చేశారు. నిజంగానే మోడీకి వ్యతిరేకంగా మాట్లాడాలి అని కెసిఆర్‌ అనుకుంటే ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలన్నారు. దేశ్‌ కి నేతా అంటే అయిపోతారా? రాష్ట్ర పతి నువ్వే అని శరద్‌ పవార్‌ కి చెప్పాడంట కేసీఆర్‌. అలాంటి ఆలోచన ఏవిూ లేదు. నీకేమైనా ఉంటే..నువ్వు ప్రయత్నం చేసుకో అని శరద్‌ పవర్‌ చెప్పాడంటున్నారని రేవంత్‌ అన్నారు. 

యూపీఏను చీల్చడం ద్వారా కాంగ్రెస్‌ను బలహీనపర్చి ఈ దేశానికి నరేంద్రమోదీని మూడోసారి ప్రధానమంత్రిగా చేయడానికి సీఎం కేసీఆర్‌ పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారని రేవంత్‌ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ను బలహీనం చేయాలంటే... యూపీఏలో ఉన్నవాళ్లను చీల్చాలన్నారు. సీఎం కేసీఆర్‌ యూపీఏలో ఉన్నవాళ్లను చీల్చడానికి ప్రయత్నం చేస్తున్నారా? లేక ఎన్డీయేలో ఉన్నవాళ్లను చీల్చడానికి ప్రయత్నం చేస్తున్నారా? అని ప్రశ్నించారు.  ఇకపోతే ఎమ్మెల్యే జగ్గారెడ్డికి తామంతా అండగా ఉంటామని, దీనిపై సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు.జగ్గారెడ్డి ఇష్యూ తమ దృష్టికి వచ్చిందన్నారు. తమ పార్టీ పెద్దలు జగ్గారెడ్డితో మాట్లాడుతున్నారని తెలిపారు. గతంలో సీనియర్‌ నేత వీహెచ్‌పై ఇలాగే సోషల్‌ విూడియాలో ప్రచారం జరిగిందని, ఆరా తీస్తే కౌశిక్‌రెడ్డి అనుచరుడని తేలిందని తెలిపారు. జగ్గారెడ్డి ఇష్యూ తమ కుటుంబ సమస్య.. అందరం కూర్చొని మాట్లాడుకుంటామని పేర్కొన్నారు. సోషల్‌ విూడియాలో వ్యతిరేకంగా పోస్ట్‌లు వచ్చాయని కుంగిపోవద్దని సూచించారు. ఇలాంటి విషయంలో మరింత బలంగా ఉండాలని రేవంత్‌రెడ్డి చెప్పారు.  పీసీసీ చీప్‌గా కొన్ని నేను బయటికి చెప్పలేనన్న ఆయన.. జగ్గారెడ్డి నాకు వ్యక్తిగతంగా మంచి స్నేహితుడన్నారు.. నేను రాజకీయాలకు రాకముందు కూడా జగ్గన్నతో పరిచయం ఉందన్న ఆయన.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి తీసుకరావడానికి మేం అందరం కలిసి పనిచేస్తాం అని ప్రకటించారు..