అసౌకర్యం కలగకుండా భద్రత చర్యలు తీసుకోవాలి:జిల్లా ఎస్పీ జే సురేందర్ రెడ్డి


మల్హర్,జనంసాక్షి

మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ జే సురేందర్ రెడ్డి అన్నారు. గురువారం కాటారం డిఎస్పీ బోనాల కిషన్ తో కలిసి కాటారం నుండి కొయ్యుర్ వరకు గల రహదారిని వారు పరిశీలించారు. ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా రోడ్డు నిర్మాణం పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సంభందిత కాంట్రాక్టర్లను ఆదేశించారు. అనంతరం కొయ్యూరు పోలీసు స్టేషన్ ను సందర్శించారు. వారి వెంట ఆర్ అండ్ బి అధికారులతో పాటు కాటారం సిఐ రంజిత్ రావు, కొయ్యూరు ఎస్ఐ టి సత్యనారాయణ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.