కస్టమ్స్ సుంకాల హేతుబద్ధీకరణకు నిర్ణయం
జీఎస్టీతో ఒకే దేశం ఒకే పన్ను అన్న కల నెరవేరిందిజీఎస్టీ వసూలు రూ.1.43 లక్షల కోట్లు
దేశవ్యాప్తంగా ఈ ఏడాది అందుబాటులోకి 5జీ
పర్వత్ మాలాలో 8 రోప్‌వేల అభివృద్ది
పర్యావరణం కోసం ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం
న్యూఢల్లీి,ఫిబ్రవరి1 (జనం సాక్షి): ఆదాయ పన్ను మినహాయింపులపై ఈసారీ నిరాశ తప్పలేదు. వేతన జీవులు ఆశగా ఎదురు చూసి డస్సిపోయారు. ఆదాయ పన్ను రాయితీల విషయంలో వేతన జీవులకు నిర్మలమ్మ నిరాశ కల్పించారు. 2022`23 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభకు సమర్పించారు. దాదాపు గంటన్నరకు పైగా ఆర్థికమంత్రి బ్జడెట్ ప్రసంగం సాగింది. అనంతరం.. లోక్‌సభను స్పీకర్ ఓం బిర్లా రేపటికి వాయిదా వేశారు. 2022`23 ఆదాయ వనరులు రూ.22.84 లక్షల కోట్లుగా చూపారు. స్వయం సమృద్ధిలో భాగంగా కస్టమ్స్ సుంకాల హేతుబద్ధత స్థానిక పరిశ్రమలకు నష్టం కలగకుండా కస్టమ్స్ సుంకాల హేతుబద్ధీకరణ ప్రకటించారు. మౌలిక సదుపాయాల కల్పనలో ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా కస్టమ్స్ సుంకాల హేతుబద్ధీకరణ ఉంటుందన్నారు. జీఎస్టీతో ఒకే దేశం ఒకే పన్ను అన్న కల నెరవేరిందన్నారు. జీఎస్టీలో ఇప్పటివరకు కొన్ని సమస్యలు ఉన్నా సవ్యదిశలోనే ముందుకు సాగుతున్నామని అన్నారు. 2022 జనవరిలో జీఎస్టీ వసూలు రూ.1.43 లక్షల కోట్లుగా చెప్పారు. జీఎస్టీ ప్రవేశ పెట్టినప్పటి నుంచి ఇదే అత్యధిక ఆదాయంగా తెలిపారు. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం చెందిందన్నారు. బయటపెట్టని ఆదాయం, సోదాల్లో దొరికినప్పుడు కఠినమైన చర్యలు ఉంటాయన్నారు. ఎలాంటి చట్టాలనుంచి కూడా మినహాయింపు లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌పీఎస్ డిడక్షన్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా 10 నుంచి 14 శాతానికి పెంచారు. ఈ ఏడాదే 5జీ..దేశవ్యాప్తంగా ఈ ఏడాది అందుబాటులోకి 5జీ సాంకేతికత రానుంది. 2022`23లో ప్రైవేటు సంస్థల ద్వారా 5జీ సాంకేతికత ప్రవేశపెడుతున్నామని
అన్నారు. 2022`23లో భారత్ నెట్ ప్రాజెక్టు ద్వారా పీపీపీ పద్ధతిలో మారుమూల ప్రాంతాలకు కూడా ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ అందుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా ఏకీకృత రిజిస్టేష్రన్ పథకం(ఎన్‌జీడీఆర్‌ఎస్) ప్రకటించారు. దేశంలో ఎక్కడి నుంచైనా రిజిస్టేష్రన్‌కు నూతన వ్యవస్థ ప్రకటించారు. దేశవ్యాప్తంగా డీడ్‌లు, రిజిస్టేష్రన్లకు ఆధునిక వ్యవస్థ తోడ్పడుతుందన్నారు. కాంట్రాక్టర్లకు ఈ`బిల్లులు పెట్టుకునే అవకాశంతో పాటు బిల్లుల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో చూసుకునే సౌకర్యం ఉందన్నారు. దేశీయ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్, గేమింగ్, కామిక్స్ రంగాలకు ప్రోత్సాహం ఇస్తామన్నారు. నగరాలు, పట్టణాల అభివృద్ధికి నూతన పట్టణ ప్రణాళికనగరాల్లో ప్రయాణ సౌకర్యాల అభివృద్ధిపట్టణాలు, నగరాల్లో నిర్మాణరంగంలో సంస్కరణలు చేపట్టామని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు డీజిల్, పెట్రోల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రోత్సహిస్తామని అన్నారు. విద్యుత్ వాహనాల పెంపులో బ్యాటరీల అభివృద్ధికి మరిన్ని ప్రోత్సాహకాలు ఇస్తామని అన్నారు. దేశవ్యాప్తంగా జిల్లాల వారీ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రత్యేక అభివృద్ధి పథకం చేపట్టినట్లు తెలిపారు. డిజిటల్ చెల్లింపులు, డిజిటల్ బ్యాంకింగ్‌కు ఈ ఏడాది కూడా మరింత ప్రోత్సాహం ఇవ్వనున్నట్లు తెలిపారు. 1.5 లక్షల పోస్టాఫీసుల ద్వారా ఆన్‌లైన్ బ్యాంకింగ్, నెట్‌బ్యాంకింగ్, ఏటీఎం సేవలుమినిమం, మ్యాక్సిమం గవర్నమెంట్ లక్ష్యంలో భాగంగా అనేక కాలం తీరిన చట్టాలను రద్దుచేశామన్నారు. 2022`23లో ఈ`పాస్‌పోర్టుల జారీకి కొత్త సాంకేతికత 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు ప్రకటించారు. మహిళా, శిశు సంక్షేమం కోసం మిషన్ శక్తి, వాత్సల్య, సక్షం అంగన్‌వాడీల రూపకల్పనగత రెండేళ్లలో నల్‌సే జల్ కింద 5.7కోట్ల కుటుంబాలకు అందుబాటులోకి తాగునీరుపీఎం ఆవాస యోజన కింద 80 లక్షల గృహాల నిర్మాణం లక్ష్యంగా ప్రకటించారు. ప్రధాని ఈ`విద్య కార్యక్రమం కింద టెలివిజన్ ఛానళ్లు 12 నుంచి 200కు పెంపుఉపాధ్యాయులకు డిజిటల్ నైపుణ్యాల శిక్షణడిజిటల్ విద్య అందించే ఉపాధ్యాయులకు అందుబాటులోకి ప్రపంచస్థాయి ఉపకరణాలు విద్యార్థులందరికి అందుబాటులోకి రానున్నాయి. చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం ప్రత్యేక క్రెడిట్ గ్యారంటీ పథకంక్రెడిట్ గ్యారంటీ పథకానికి రూ.2 లక్షల కోట్ల ఆర్థిక నిధులుపరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి కోసం అదనపు నిధులు, ప్రత్యేక వ్యవస్థలుఉద్యోగులు, కార్మికుల్లో నైపుణ్యాభివృద్ధి కోసం ఆన్‌లైన్‌లో నేర్చుకునేందుకు అవకాశాలు కల్పించారు. ప్రతి రాష్ట్రంలో కొన్ని ప్రత్యేక ఐటీఐల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. పర్వతమాల ప్రాజెక్టు కింద పర్యావరణ హితమైన అభివృద్ధికొండ ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి తగినంత అవకాశాలుపర్వతమాల ప్రాజెక్టులో 8 రోప్‌వేల అభివృద్ధిదేశంలో నాలుగుచోట్ల మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేస్తారు. మల్టీమోడల్ కనెక్టివిటీలో భాగంగా రైల్వేలతో ఇతర రవాణా సదుపాయాల అనుసంధానం చేయనున్నారు. వచ్చే మూడేళ్లలో వంద కార్గో టెర్మినళ్ల ఏర్పాటు చేస్తారు. చిరుధాన్యాల అభివృద్ధికి అదనపు ప్రోత్సాహం ఇస్తారు. 2023ను తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించి, వంటనూనెల కోసం దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా ఉత్పత్తి చేస్తారు. పీపీపీ మోడల్‌లో ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తారు. రసాయన రహిత వ్యవసాయ అభివృద్ధికి మరింత ప్రోత్సాహం ఇస్తూ సేంద్రీయ ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం ఇస్తారు. వ్యవసాయ ఉత్పత్తుల విలువ పెంపు కోసం స్టార్టప్‌లకు ఆర్థిక సాయం అందిస్తారు. రైతులకు అద్దె ప్రాతిపదికన వ్యవసాయ పనిముట్లు ఇచ్చేందుకు ప్రత్యేక పథకం ప్రకటించారు. యువత, మహిళలు, రైతులు, ఎస్సీ, ఎస్టీలకు గొప్ప ఊతమివ్వబోతోందని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.