ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి

 

హైద‌రాబాద్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి(50) హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. సోమ‌వారం ఉద‌యం ఆయ‌న‌కు గుండెపోటు రావ‌డంతో.. హైద‌రాబాద్‌లోని అపోలో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆస్ప‌త్రి లోప‌ల‌కి వ‌చ్చే లోపే గౌత‌మ్ రెడ్డి క‌న్నుమూసిన‌ట్లు వైద్యులు తెలిపారు. వారం రోజుల‌పాటు దుబాయ్ ఎక్స్‌పోలో పాల్గొన్న‌ గౌత‌మ్ రెడ్డి.. రెండు రోజుల క్రిత‌మే హైద‌రాబాద్‌కు చేరుకున్నారు. ఇటీవ‌లే కొవిడ్ బారిన ప‌డ్డ గౌత‌మ్ రెడ్డి త్వ‌ర‌గానే కోలుకున్నారు. పోస్టు కొవిడ్ ప‌రిణామాలే గుండెపోటుకు కార‌ణ‌మై ఉండొచ్చ‌ని ఆయ‌న కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితులు అనుమానిస్తున్నారు.

గౌత‌మ్ రెడ్డి మృతితో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తో పాటు వైసీపీ నేత‌లు తీవ్ర దిగ్ర్భాంతికి గుర‌య్యారు. గౌత‌మ్ రెడ్డి మృతిప‌ట్ల‌ సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు నివాళుల‌ర్పించారు. గౌత‌మ్ రెడ్డి కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి ప్ర‌క‌టించారు. చివ‌రిసారిగా దుబాయ్‌లోని ఖ‌లీజ్ టైమ్స్‌కు గౌత‌మ్ రెడ్డి ఇంట‌ర్వ్యూ ఇచ్చారు.

2014, 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గౌత‌మ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గౌత‌మ్ రెడ్డి స్వ‌గ్రామం నెల్లూరు జిల్లాలోని మ‌ర్రిపాడు మండ‌లం బ్రాహ్మ‌ణ‌ప‌ల్లి. నెల్లూరు జిల్లాలో ఆయ‌న పారిశ్రామిక‌వేత్త‌, రాజ‌కీయ‌వేత్త‌గా ఎదిగారు. నెల్లూరు మాజీ ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి కుమారుడే గౌత‌మ్ రెడ్డి.

అమరావతి: మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం పట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. విషాదంలో మునిగిపోయారు. విషయం తెలియగానే ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్‌ వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, డీజీపీ కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి, పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయిరెడ్డి, టీటీడీ ఛైర్మన్‌ వై.విసుబ్బారెడ్డి, చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శులు సాలోమన్‌ ఆరోకియా రాజ్, రేవు ముత్యాలరాజు, ధనుజయ్‌ రెడ్డిలతో ముఖ్యమంత్రితో తన నివాసంలో సమావేశమయ్యారు.

  • మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం పట్ల సీఎం జగన్‌ దిగ్భ్రాంతి

YS Jagan Expresses Grief Over Death Of Minister Gowtahm Reddy - Sakshi

గౌతంరెడ్డితో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. చిన్ననాటినుంచే తనకు బాగా పరిచయమంటూ ముఖ్యమంత్రి ఆవేదనలో మునిగిపోయారు. ఒక స్నేహితుడినే కాకుండా సమర్థుడైన మంత్రిని, విద్యాధికుడ్ని కోల్పోయానని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. తన రాజకీయ ప్రయాణంలో తోడుగా నిలిచారంటూ సీఎం గుర్తుచేసుకున్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక, వాణిజ్య, ఐటీ అభివృద్ధికి విశేష కృషిచేశారని. ప్రభుత్వ పారదర్శక పారిశ్రామిక విధానాలను సమర్థవంతంగా అమలు చేయడంద్వారా రాష్ట్రానికి మంచి గుర్తింపు తీసుకు వచ్చారని సీఎం అన్నారు. రెండుసార్లు ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ప్రజల ఆదరాభిమానాలతో గెలుపొంది ఉజ్వలభవిష్యత్తు ఉన్న నాయకుడ్ని కోల్పోయానని ఆవేదన వ్యక్తంచేశారు. గౌతమ్‌రెడ్డి మరణం తనకే కాదు, రాష్ట్రానికే తీరని లోటని అన్నారు.

గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మృతి పట్ల గవర్నర్ తీవ్ర దిగ్భ్రాంతి 
పరిశ్రమలు, వాణిజ్యం, సమాచార సాంకేతిక శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో సోమవారం హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన ముందున్న ఆశాజనక రాజకీయ జీవితంతో యువ, డైనమిక్ మంత్రిగా ఉన్న గౌతమ్‌రెడ్డి ఇంత చిన్న వయస్సులో మరణించడం చాలా బాధాకరమని గవర్నర్ అన్నారు. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానన్నారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియ చేశారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.

మంత్రి గౌతమ్‌ రెడ్డి భౌతిక కాయానికి ప్రముఖుల నివాళి
మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి భౌతిక కాయానికి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి కొడాలి నాని, వలభనేని వంశీ, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ నివాళులు అర్పించారు. గౌతమ్‌ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు.

అధికార లాంఛనాలతో మంత్రి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు
మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతి పట్ల అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. స్థానికులు, కార్యకర్తలు గౌతమ్‌రెడ్డికి ఘన నివాళులు అర్పించారు. ఏపీ ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. గౌతమ్‌ రెడ్డి భౌతికకాయాన్ని హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని నివాసానికి తరలించారు. సోమవారం రాత్రికి స్వగ్రామం బ్రహ్మణపల్లికి తరలించనున్నారు. అమెరికాలోఉన్న కుమారుడు వచ్చాక బుధవారం అధికార లాంఛనాలతో గౌతమ్‌ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి(50) హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 9.16 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఉదయం 7.45 నిమిషాలకు అపోలో అసుపత్రికి చేరుకోగా.. 90 నిమిషాల పాటు వైద్యులు గౌతమ్‌రెడ్డికి ఐసీయూలో చేర్చి అత్యవసర సేవలు అందించారు. అయినా ప్రాణాలు దక్కలేదు. దీంతో కుటుంబ సభ్యులకు ఆసుపత్రి వైద్యులు సమాచారం అందించారు.

కాగా పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ రాజమోహన్‌రెడ్డి కుమారుడు గౌతమ్‌రెడ్డి. 1971 నవంబర్‌2న జన్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ పూర్తి చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికలతో గౌతమ్‌ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు. నెల్లూరు జిల్లా అత్మకూరు నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి గెలుపొందారు. రెండుసార్లు ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలిచారు.అయితే మేకపాటి వారం రోజులపాటు దుబాయ్‌ ఎక్స్‌పోలో పాల్గొన్నారు. ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చే అంశంపై పలు సంస్థలతో  సంప్రదింపులు జరిపి కొన్ని సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. దుబాయ్‌ ఎక్స్‌పోలో పాల్గొని ఆదివారమే హైదరాబాద్‌ చేరుకున్నారు. గత నెల 22న కోవిడ్‌ బారిన పడి కోలుకున్నారు. అయితే సోమవారం ఉదయం గుండె పోటు రావడంతో అపోలో ఆ‍స్పత్రిలో చేర్చి అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. గౌతమ్‌రెడ్డి మరణ వార్త విన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. హైదరాబాద్‌కు బయల్దేరారు.

మంత్రి హరీశ్ రావు సంతాపం

ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పట్ల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సంతాపం వ్యక్తం చేశారు. సన్నిహితుడైన మేకపాటి మరణం నన్ను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మేకపాటి, మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్న నాయకుడన్నారు.ఎంతో నిబద్ధత, క్రమశిక్షణతో పని చేసే మేకపాటి చిన్న వయసులోనే చనిపోవడం బాధాకరమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని,వారి కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

మంత్రి కేటీఆర్ గౌత‌మ్ రెడ్డి భౌతికకాయానికి కేటీఆర్ నివాళుల‌ర్పించారు.

ఏపీ మంత్రి గౌత‌మ్ రెడ్డి అకాల మ‌ర‌ణం తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింద‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబ‌ర్ 46లోని గౌత‌మ్ రెడ్డి ఇంటికి కేటీఆర్ సోమ‌వారం మ‌ధ్యాహ్నం వెళ్లారు. గౌత‌మ్ రెడ్డి భౌతికకాయానికి కేటీఆర్ నివాళుల‌ర్పించి, పుష్పాంజ‌లి ఘ‌టించారు. ఈ సంద‌ర్భంగా గౌత‌మ్ రెడ్డి కుటుంబ స‌భ్యుల‌కు సానుభూతి తెలిపారు. అనంత‌రం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. గౌత‌మ్ రెడ్డితో త‌న‌కు 12 ఏండ్లుగా ప‌రిచ‌యం ఉంద‌న్నారు. ఉజ్వ‌ల భ‌విష్య‌త్ ఉన్న నాయ‌కుడు గౌత‌మ్ రెడ్డి అని పేర్కొన్నారు. కుటుంబ స‌భ్యుల‌కు దేవుడు ధైర్యం ఇవ్వాల‌ని ప్రార్థిస్తున్నాను. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంది అని కేటీఆర్ తెలిపారు.సోమ‌వారం ఉద‌యం గౌత‌మ్ రెడ్డికి గుండెపోటు రావ‌డంతో.. హైద‌రాబాద్‌లోని అపోలో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆస్ప‌త్రికి తీసుకొచ్చే లోపే గౌత‌మ్ రెడ్డి క‌న్నుమూసిన‌ట్లు వైద్యులు తెలిపారు. వారం రోజుల‌పాటు దుబాయ్ ఎక్స్‌పోలో పాల్గొన్న‌ గౌత‌మ్ రెడ్డి.. రెండు రోజుల క్రిత‌మే హైద‌రాబాద్‌కు చేరుకున్నారు. ఇటీవ‌లే కొవిడ్ బారిన ప‌డ్డ గౌత‌మ్ రెడ్డి త్వ‌ర‌గానే కోలుకున్నారు. పోస్టు కొవిడ్ ప‌రిణామాలే గుండెపోటుకు కార‌ణ‌మై ఉండొచ్చ‌ని ఆయ‌న కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితులు అనుమానిస్తున్నారు.