రైలు ఢీకొని చిరుత పిల్ల మృతి

కర్నూలు,ఫిబ్రవరి26(జనం సాక్షి): ల్లమల అటవీ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రైలు ఢీ కొని ఓ చిరుత పిల్ల మరణించింది. మహానంది సవిూపంలోని అడవిలో రైలు ఢీకొని చిరుత పిల్ల మృతి చెందిందని అటవీశాఖ అధికారులు చెప్పారు. రైల్వే ట్రాక్‌ పై మృతి చెందిన ఉన్న చిరుతపులిని చూసి రైల్వే శాఖ సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. చిరుత పిల్ల కళేబరాన్ని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకొని.. కార్యాలయానికి తరలించారు. అంతకు ముందు కూడా నల్లమల అటవీ ప్రాంతాల్లో పలు వాహనాలు ఢీకొని అటవీ జంతువులు మరణించాయి.