ఘన వ్యర్థ పదార్థాల ప్రాసెసింగ్ కేంద్రం ను సందర్శించిన డిఎల్ పి ఓ శిరీష


నర్సీపట్నం ఫిబ్రవరి 14 (జనంసాక్షి):

నర్సీపట్నం మండలం ధర్మసాగరం పంచాయితీ లోని  ఘన వ్యర్థ పదార్థాల ప్రాసెసింగ్ కేంద్రంను నర్సీపట్నం డీఎల్ పిఓ ఆర్ శిరీష రాణి, ఈ ఓ (పీఆర్&ఆర్డీ) బివి రమణబాబు సోమవారం సందర్శించారు.ఈ సందర్భంగా డీఎల్ పిఓ శిరీష రాణి మాట్లాడుతూ ధర్మసాగరం పంచాయితీ లోని  ఘన వ్యర్థ పదార్థాల ప్రాసెసింగ్ కేంద్రంను సందర్శించడం జరిగిందని. ఈ కేంద్రంలో తయారుచేస్తున్న  వర్మీ కంపోస్ట్,డ్రై వేస్ట్ అమ్మకం ద్వారా పంచాయతీ కి  ఆదాయాన్ని సమకూర్చాలంటూ సూచనలు చెయ్యడం జరిగిందన్నారు. అదేవిధంగా కేంద్రానికి ఇచ్చి నిరుపయోగంగా ఉన్న ఆటోలను మనుగడలోకి తీసుకు రావాలంటూ ఆదేశాలు జారీచేశారు. ఈ  ధర్మసాగరం పంచాయతీ సెక్రటరీ చంద్రశేఖర్, ధర్మసాగరం సర్పంచ్,సిబ్బంది పాల్గొన్నారు.