దళితబాధంవుడు కెసిఆర్‌: ఎమ్మెల్యే


వరంగల్‌,ఫిబ్రవరి26(జనం సాక్షి ): సీఎం కేసీఆర్‌ దళితబాంధవుడని, దళితుల జీవితాల్లో పెనుమార్పులు తీసుకువస్తున్నారని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ అన్నారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు వంద యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తున్న నేపథ్యంలో 18, 19, 20, 21 డివిజన్లకు చెందిన వారితో నిర్వహించిన

అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితుల ఆర్థిక స్వావలంభన కోసం దళితబంధు, వంద యూనిట్ల ఉచిత కరెంటు, ఎస్సీ సబ్‌ఎª`లాన్‌ ఓవర్సీస్‌ స్కాలర్‌ షిప్‌ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. దళితులు, బహుజనులు ఆర్థిక పరిపుష్టి సాధించాలని రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చారన్నారు.