విష‌మంగా ల‌తా మంగేష్క‌ర్ ఆరోగ్య ప‌రిస్థితి


భార‌త‌దేశం గ‌ర్వించ ద‌గిన దిగ్గ‌జ గాయ‌ని ల‌తా మంగేష్క‌ర్ ఆరోగ్య ప‌రిస్థితి క్షీణించిన‌ట్లు ఆస్ప‌త్రి వైద్యులు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఆమెకు వెంటిలేట‌ర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నామ‌ని ముంబై లోని బ్రీక్ క్యాండీ ఆస్ప‌త్రి డాక్ట‌ర్ ప్ర‌తీత్ సంధాని వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ల‌తా మంగేష్క‌ర్ కు 92 ఏళ్లు. ఇటీవ‌ల ఆమెకు కోవిడ్ పాజిటివ్ అని నిర్దార‌ణ అయ్యింది. గ‌త నెల జ‌న‌వ‌రి 11న బ్రీచ్ క్యాండీలో చేర్చారు.