ఎమ్మెల్యే రాజాసింగ్‌ అనుచిత వ్యాఖ్యలు


యూపిలో బిజెపికే ఓటేయక తప్పదని హెచ్చరికలు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 15 (జనం సాక్షి):  గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు షాక్‌కి గురి చేస్తున్నాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఓటు వేయకుంటే బుల్‌డోజర్లను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. యూపీలో ఉండాలంటే యోగి అనాల్సిందేనని.. ఆయనకు జై కొట్టాల్సిందేనని వార్నింగ్‌ ఇచ్చారు. రాజాసింగ్‌ మంగళవారం హైదరాబాద్‌లో విూడియాతో మాట్లాడుతూ.. ’యూపీలో రెండు విడతల ఎన్నికలు పూర్తయ్యాయి. త్వరలో మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. హిందువులంతా ఏకమవ్వాలి. యోగికి ఓటు వేయకుంటే జేసీబీ, బుల్డోజర్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎన్నికల తరువాత యోగికి ఓటు వేయని వారిని గుర్తిస్తాం. యూపీలో ఉండాలంటే యోగికి జైకొట్టాలి. లేకపోతే యూపీ వదిలి వెళ్లాల్సిందే. యూపీలో యోగిబాబా ప్రభుత్వం రాబోతుంది’ అంటూ యూపీ ప్రజల్ని హెచ్చరించారు.