నాటి విభజన పక్రియ ఇరు రాష్టాల్ర మధ్య వైషమ్యాలు పుట్టించింది. ఇది ఎవరూ కాదనలేని నిజం. ఇప్పటికీ నష్టం చేస్తున్నదని.. ఎపి ప్రజలు వాపోతున్నదీ కూడా నిజమే. అయితే మోదీ రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలను తెలుగుప్రజలు ఎవరు కూడా ఆమోదించడం లేదు. ఎందుకంటే సానుభూతి కన్నా సమస్యల పరిష్కారం ముఖ్యమన్న ధోరణిలో ప్రజలు ఉన్నారు. విభజన తరవాత ఉభయ తెలుగు రాష్టాల్ర ప్రజలు మానసికంగా స్థిరపడి పోయారు. ఎవరికి వారు బతుకుతున్నారు. ఈ స్థితిలో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించేలా ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు పుండువిూద కారం చల్లినట్లుగా ఉన్నాయి. కేంద్రం విభజన హావిూలను నెరవేర్చడం లేదన్న మంటలో ఉన్న ప్రజలకు ఈ వ్యాఖ్యలు మరింత మంటరేపాయి. తెలంగాణ లో టిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలు చూస్తే ప్రజలు ఎంతగగా కసిగా ఉన్నారో అర్థం చేసు కోవాలి. టిఆర్‌ఎస్ పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా మోడీ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటాయి. మోడీ తీరుపై తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు మోడీపై విమర్శల దాడికి పూనుకున్నాయి. తిరుపతి పుణ్యక్షేత్రంలో మోదీ ఎన్నికల ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తానని ప్రమాణం చేసినా నెరవేర్చ లేదు. సరికాదా రకరకాల విన్యాసాలు చేశారు. కడప ఉక్కు సంగతి పక్కన పెడితే ఉన్న విశాఖ ఉక్కును తుక్కుగా అమ్మడానికి సిద్దం అయ్యారు. ఇది నిజంగానే ప్రజలకు ఆగ్రహం తెప్పించే విషయం. ఉద్యమం ద్వారా సాధించుకున్న విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టడం ప్రజల సెంటిమెంట్‌ను దెబ్బకొట్టడమే. అమరావతి ఉద్యమం సాగుతున్న వేళ వారికి కనీస స్వాంతన చేకూర్చే ప్రయత్నం చేయలేదు. ఈ క్రమంలో మోదీవ్యాఖ్యలు ఉభయ తెలుగు రాష్టాల్రో బిజెపిని ఆత్మరక్షణలోకి నెట్టివేశాయి. ఆంధ్రప్రదేశ్‌తో పోల్చితే తెలంగాణలో టిఆర్‌ఎస్ ఎంతో దూకుడుగా వెంటనే నినరసనలకు పిలుపునిచ్చింది. తెలంగాణలో క్రమంగా బలపడుతున్న స్థితిలో రాష్ట్ర విభజనకు బీజేపీ వ్యతిరేకమన్న సందేశం..అదీ మోడీ ద్వారా రావడంతో ఇప్పుడు బిజెపి నేతలు తలలు పట్టుకుంటున్నారు. మోడీ వ్యాఖ్యలు ఓ రకంగా కెసిఆర్‌కు టిఆర్‌ఎస్‌కు బలాన్ని ఇచ్చాయనే చెప్పాలి. కాంగ్రెస్‌ను తిట్టాలనుకునే క్రమంలో ఆయన సొంతపార్టీ ప్రయోజనాలను పణంగా పెట్టారా అన్న భావన కలుగుతోంది. ఇకపోతే నోట్ల రద్దు, జిఎస్టీ, కరోనా తరవాత పేదలు, దనవంతుల మధ్య ఆంతర్యం బాగా పెరిగింది. రెండు ఇండియాలు అంటూ సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. మోదీ ఆదానీ,అంబానీ లాంటి వారికి మాత్రమే అండగా ఉంటున్నారన్న భావన ప్రజల్లో బాగా బలపడిపోయింది. పేదలను నిరుపేదలుగా మార్చేస్తున్నారన్న విమర్శలకు విూడియా ద్వారా బాగా ప్రాచుర్యం వస్తోంది. పలు ప్రభుత్వరంగ సంస్థలను అమ్మకానికి పెట్టడం, వాటిని సక్రమంగా నిర్వహించలేక చేతులెత్తేయడం..నీరవ్ మోడీ, విజయ్ మాల్యా లాంటి వారిని దేశం దాటించడం వంటి వాటిపైనా ప్రజలకు అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ మోడీ నేతృత్వంలో జరిగినవే అన్న భవనా ఉంది. రాష్ట్ర విభజన పక్రియపై చేసిన విమర్శలు కాంగ్రెస్ పరువుతీయాలన్న లక్ష్యాన్ని నెరవేర్చడానికి బదులు, తన పార్టీకి రాజకీయంగా నష్టం చేకూర్చేలా చేసుకున్నారు. రాష్ట్ర విభజనను కాంగ్రెస్ ప్రజాస్వామికమార్గంలో చేయలేదన్న భావన ఉంటే.. సమస్యలను తాను ఈ విధంగా పరిష్కరించానని చెప్పుకునేందుకు మోడీకి, బిజెపికి కూడా ఏవిూ లేదు. ఎందుకంటే ఎపికి ఒక్కటంటే ఒక్క ప్రయోజనం చేకూరలేదు. చర్చకు తావులేకుండా అహంకారంతో నాటి కాంగ్రెస్ వ్యవహరించిందని మోదీ వాదనగా ఉంది. అయితే అనేక బిల్లులను మోడీ కూడా అలాగే చేశారు. ఎన్టీరామారావు ప్రభుత్వాన్ని అస్థిరపరచడం, అంజయ్యను అవమానించడం వంటి అంశాలను ప్రస్తావిం
చడం ద్వారా కాంగ్రెస్‌వి దెబ్బతీయాలనుకోవడం కూడా సరికాదు. ఎందుకంటే ఈ తరం ప్రజలకు ఇప్పుడు ఆ విషయాలు గుర్తుండి ఉండవు. వారికి పెరుగుతన్న నిత్యావసర ధరలు, పెట్రలో ధరలు, గ్యాస్ ధరలు, ఇంటి నిర్మాణ ధరలు.. జిఎస్టీ వాతలు వంటివి మాత్రమే గుర్తుంటున్నాయి. ఈ క్రమంలో వాటిగురించి ప్రస్తావించకుండా ఉండేందుకు ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారన్న భావన ప్రజల్లో ప్రబలుతోంది. మోదీ ప్రస్తుత వ్యాఖ్యలు దశాబ్దాల తెలంగాణ పోరాటాన్నే కాక, బిల్లు ఆమోదంలో కీలకపాత్ర పోషించిన సుష్మాను అవమానిస్తున్నాయని తెలంగాణ వాసులు మూకుమ్మడిగానే భావిస్తున్నారు. నిజానికి మోడీ వచ్చాక ఓ బృహత్తర భారతం ఆవిష్కృతం అవుతుందని అంతా భావించారు. ప్రధానంగా సామాన్యులు చాలా ఆశ పడ్డారు. కానీ జరిగింది అందుకు పూర్తి భిన్నంగా ఉంది. పెద్దనోట్ల రద్దు మొదలు జీఎస్‌టీ వరకు తీసుకున్న నిర్ణయాలు ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఢల్లీిలో కూర్చుని తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా సామాన్యులు అతలాకుతలం అవుతున్నారు. అఛ్చేదిన్‌కు నిర్వచం లేకుండా పోయింది. కేవలం కొందరి స్వార్థం కోసం,కొందరి ప్రయోజనాల కోసం 90శాతం భారతీయులు ఇబ్బందులు పడుతున్నా.. మోడీ ఏనాడూ దానిపై చర్చించలేదు. బిజెపి నేతలు కూడా ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయింది. పార్టీలో అంతర్గతంగా చర్చజరగడం లేదు. అయినా ఈ దేశాన్ని ఉధ్దరించేందుకు వచ్చిన మహానుభావుడన్న రీతిలో మోడీని సోషల్ విూడియా వేదికగా పొగగడ్తలతో ముంచెత్తే ప్రచారం మాత్రం సాగుతోంది. తాజాగా జీఎస్టీ భయాలు వెన్నాడుతున్నా వాటిని సవరించి ఆదుకుంటామన్న ఒక్కమాట కూడా ప్రభుత్వం నుంచి రావడం లేదు. దీంతో ప్రజలకు మోడీ ప్రభుత్వం భరోసాగా లేదన్న విషయం అర్థం అవుతోంది. విపక్షాలు కూడా సమస్యలను చర్చించడానికి పార్లమెంట్‌లో అవకాశాలు వచ్చినా వదులు కుని, గొడవలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. సమస్యను సమస్యగా చర్చించడంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు పూర్తిగా విఫలమయ్యారు. పార్లమెంటులో సమస్యలను ప్రస్తావించడం కన్నా గొడవ చేసి వాయిదా వేయించ డంలోనే కాలం గడుపుతున్నారు.కనీసం ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అయినా దేశం, ప్రజలు ఎదుర్కొంటున్న అనేకానేక సమస్యలపై సమగ్ర చర్చకు పట్టుబట్టాలి. అందుకు అనుగుణంగా వాతావరణం సృష్టించుకోవాలి. మంచిరోజులు ముందున్నాయని చెప్పి అధికారంలోకి వచ్చిన నరేంద్రమోడీ వల్ల ప్రజలకు మంచిరోజులు పోయాయి. ప్రధాని మాటల్లో మాత్రమే వినిపించే ’అచ్ఛేదిన్’ వస్తాయో లేదో గానీ ప్రస్తుతం పరిస్తితులు మాత్రం దేశాన్ని కలవరపెడుతున్నాయి. దుర్భరపరిస్థితులు ఎదుర్కొంటున్నారు.
దేశాన్ని గందరగోళంలోకి నెట్టిన మోడీ !