బిజెపి దీక్షలను అడ్డుకున్న పోలీసులు
పోలీసుల తీరుపై మండిపడ్డ బిజెపి నేతలుజనగామ, ఫిబ్రవరి 10 (జనంసాక్షి): జనగామలో మరోమారు ఉద్రిక్తత నెలకొంది. టిఆర్‌ఎస్,బిజెపి నేతలు పరస్పర గర్షణకు దిగారు. బుధవారం టీఆర్‌ఎస్ చేపట్టిన దిష్టిబొమ్మల దగ్ధం నేపథ్యంలో ఇరుపార్టీల మధ్య ఘర్షణ జరిగింది. దీనినినిరసిస్తూ బీజేపీ నేతలు గురువారం ఉదయం జనగామ ప్రధాన కూడళ్లలో దీక్షకు పిలుపునిచ్చారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి మౌనదీక్ష చేసేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంతలో టీఆర్‌ఎస్ అక్కడికి చేరుకుని నినాదాలు చేయడంతో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ వివాదంలో జనగామ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దశమంత్ రెడ్డితో పాటు పలువురికి గాయాలయ్యాయి. ఇంత వివాదం జరుగుతున్నా టీఆర్‌ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేయకుండా బీజేపీ నేతలను మాత్రమే అదుపులోకి తీసుకుని అడ్డుకోవడం హాస్యాస్పదంగా ఉందని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదానికి పోలీసులే ప్రధాన కారణమని పోలీసులు టీఆర్‌ఎస్ పార్టీకి కొమ్ము కాస్తున్నారని, చట్టం అందరికీ సమానంగా ఉండాలని ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. విభజనపై పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తెరాస, కాంగ్రెస్ పార్టీలు భాజపాపై విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో జనగామ చౌరస్తాలో కాంగ్రెస్, తెరాస ఆధ్వర్యంలో బుధవారం తలపెట్టిన ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమాన్ని భాజపా శ్రేణులు అడ్డుకోవటంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు పార్టీల శ్రేణులు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడిరది. తెరాస, భాజపా శ్రేణులు పోటాపోటీ నినాదాలు చేసుకున్నాయి. సహనం కోల్పోయిన భాజపా, తెరాస కార్యకర్తలు కర్రలతో కొట్టుకున్నారు. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. జనగామలో టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తలకు మధ్య జరిగిన తదితరులు పరామర్శించారు.