పాడేరు పట్టణంలో జోరుగా డీజిల్ /పెట్రోల్ దొంగతనాలు


రాత్రిపూట పోలీస్ గస్తీ లేక ఈ పరిస్థితి..?


పాడేరు:ఫిబ్రవరి4:జనం సాక్షి:


పాడేరు పట్టణంలో రోజురోజుకు డీజిల్ /పెట్రోల్  దొంగతనాలు ఎక్కువైపోతుంది.ప్రస్తుతపరిస్థితుల్లో డీజిల్/ పెట్రోల్ ధరలుఆకాశన౦టూకుంది. తెల్లర్లు ప్రయాణానికి సిద్ధం చేసుకున్న ద్విచక్ర, నాలుగు చక్రాలవాహనదారులుఇంటిముందునిల్చోబెట్టుకొంటేరాత్రికిరాత్రిదొంగలువచ్చిచక్కబెట్టుకుపోతున్నారు. దీంతో మార్గంమధ్యలో వాహనాలు ఆగిపోయే పరిస్థితి ఏర్పడి.  అత్యవసర ప్రయాణాలు సైతం ఇబ్బందులు పడేపరిస్థితి.ఇదేవిషయంపైపలువురు స్టేషన్లో తెలియజేసిన పోలీస్ శాఖ స్పందించక పోగా..? రాత్రిపూట గస్తీ  నిర్వహించాక ఈ పరిస్థితి దాపురిస్తుందని పలువురు వాహనదారులు పోలీస్ శాఖ పనితీరుపై పబ్లిక్గా విమర్శలు గుప్పిస్తున్నారు. శుక్రవారం కొన్ని వాహనాలు ఇండ్ల సమీపంలో ఉంచి ఉంటేనే

 పెట్రోల్, డీజిల్ దొంగతనం జరిగింది. నడిరోడ్డు మీద ఆపి ఉన్న వాహనాలు సైతం వదలక పోతుంటే ఇంటి ముందు,వీధుల్లో నిల్చోబెట్టి ఉన్న వాహనాల పరిస్థితిఎంతదారుణంగాఉంటుందోఅర్థంఅవుతున్నాయి. అలాగే పట్టణంలో ఉన్న సీసీ కెమెరాలు పనిచేయకపోవడంకూడాదొంగలకుకలిసివచ్చినట్లే..? నేడు డీజిల్ పెట్రోల్ దొంగతనానికి పాల్పడిన వారు రేపు వాహనాలు సైతం ఎత్తుకుపోరా..?అనేది నిజమైన సత్యం..! గతంలో దొంగతనాలకు పాల్పడిన వారిని సరి అయిన చర్యలు తీసుకోకపోవడంతో నే మళ్లీ ఇటువంటి వాటికి పాల్పడడంజరుగుతుందనిపలువురుఅంటున్నారు. అలాగే ఇతర ఇతర దుకాణసముదాయాలలో కూడా ఈ మధ్య కాలం దొంగలు బీభత్సం సృష్టించారు. అయినా  చర్యలు తీసుకోవడంలో పాడేరు పోలీసు లు విఫలం అయ్యారనడంలో ఎటువంటి సందేహం లేదు. కావున పోలీసు శాఖ ఇప్పటికైనా స్పందిస్తూ గస్తీ నిర్వహించిV దొంగతనాలు జరగకుండా అరికడతారో లేక పోలీసుల పై పలువురు చేస్తున్న విమర్శలకు తవిస్తారో వేచిచూడాల్సిందే...!