ముంబైలో భారీ అగ్నిప్రమాదం
ముంబై,ఫిబ్రవరి28 ( జనం సాక్షి): మహారాష్ట్ర రాజధాని ముంబైలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కంజూర్‌మార్గ్‌లోని ఎన్‌జీ రాయల్ పార్కు ఏరియాలోని ఓ 10 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. 9వ అంతస్తు నుంచి అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. మంటలను ఆర్పేందుకు 10 ్గªరిరజన్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మిగతా అంతస్తుల్లో నివాసముంటున్న వారు భయంతో అపార్ట్‌మెంట్‌ను వదిలి బయటకు వస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.