నాన్‌ టీచింగ్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

వీణవంక,ఫిబ్రవరి 03,(జనంసాక్షి) : వీణవంక మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాలలో,కేజీబీవీ,ఘన్ముక్ల మోడల్‌ స్కూల్‌లో నాన్‌ టీచింగ్‌ పోస్ట్‌ కు అవుట్‌ సోర్సింగ్‌ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి కేతిరి వెంకట నరసింహరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.కేజీబీవీ వీణవంకలో   స్కావెంజర్‌ పోస్ట్‌ ఒకటి ఖాళీగా ఉందని,ఈ పోస్టుకు విద్యార్హత 7వ తరగతి,వేతనం నెలకు రూ.9750 ఉందన్నారు. అలాగే మోడల్‌ స్కూల్‌ ఘన్ముకులలో కేర్‌ టేకర్‌ పోస్టు  ఖాళీగా ఉందని, దీనికి డిగ్రీతో పాటు  డీఈడీ,బీఈడీ,పోస్టుకు వేతనం నెలకు రూ.6700గా ఉందన్నారు. ఈ నెల 5వ తేదీలోపు మండల విద్యావనరుల కేంద్రంలో దరఖాస్తులు సమర్పించాలని కోరారు.