ఎబివిపి ఆధ్వర్యంలో నిరసనలు
రాజన్న సిరిసిల్ల,ఫిబ్రవరి28 ( జనం సాక్షి): రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో డిగ్రీ కాలేజ్ కోసం విద్యార్థులు ఆందోళన చేశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో రోడ్డుపై భైఠాయించి నిరసన తెలిపారు. ప్రైవేట్ కాలేజీలో చదివే స్థోమత లేక పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తామని 2017లో మంత్రి కేటీఆర్ హావిూ ఇచ్చారన్నారు. 5 ఏండ్లు గడస్తున్నా హావిూ నెరవేర్చని కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.