దామాషా ప్రకారం బిసిలరు సీట్లు ఇవ్వాలి: విహెచ్‌

పెద్దపల్లి,ఫిబ్రవరి10(జనంసాక్షి): బీసీల దామాషా ప్రకారమే సీట్లు కేటాయించాలని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జిల్లా కేంద్రంలో మాజీ ఎంపీ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హన్మంతరావు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మాజీ ఎంపీ వీహెచ్‌ మాట్లాడుతూ.. ఓట్లు బీసీలవి.. రాజ్యాధికారం మాత్రం అగ్రవర్ణాలకే దక్కుతుందన్నారు. బీసీలు ఉన్న ప్రాంతాలలో బీసీలకే సీట్లు ఇవ్వాలన్నారు. తెలంగాణ రాష్ట్రం.. కాంగ్రెస్‌ వల్లే సాధ్యమైందన్నారు. పార్లమెంటులో ప్రధాని మోదీ మాటలు అర్థం లేనివన్నారు. కాంగ్రెస్‌లో ఎవరికైనా సోనియా గాంధే టికెట్స్‌ ఇస్తారని వీహెచ్‌ పేర్కొన్నారు.