జాతీయస్థాయి సైన్స్ ప్రదర్శనకు మునగాల ప్రాజెక్టు ఎంపికమునగాల, ఫిబ్రవరి 10(జనంసాక్షి): 2020-21 సంవత్సరానికి గాను ఇన్ స్పైర్ అవార్డ్స్ ప్రాజెక్టులో భాగంగా గత నెలలో రాష్ట్రస్థాయిలో ఎంపిక కాబడి గురువారం విడుదలైన ఫలితాలలో తెలంగాణ రాష్ట్రం నుండి జాతీయస్థాయి ప్రదర్శనకు సూర్యాపేట జిల్లా నుండి మునగాల జిల్లా పరిషత్ పాఠశాల నుండి ఒకే ఒక ప్రాజెక్ట్ ఎంపికయింది. పాఠశాల ఉపాధ్యాయులు షేక్ జాఫర్ సూచనలతో బాల శాస్త్రవేత్త టి. అఖిల్ రూపొందించిన ఈ ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల ప్రధానోపాధ్యాయులు డి.  సీతారామ రాజు, ఎస్ఎమ్సి చైర్మన్ తోకల సైదులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

ప్రాజెక్ట్ వివరాలు:

కొబ్బరి బొండం నుండి కొబ్బరి నీళ్లు తీసే యంత్రం. తక్కువ శ్రమతో మహిళలు సైతం తేలికగా వాడగలిగే విధంగా కొబ్బరి బోండాలు కొట్టే యంత్రాన్ని తయారు చేయడం జరిగింది. కేవలం రెండు వేల రూపాయలతో తయారుచేసిన ఈ యంత్రం సహాయంతో కొబ్బరి బొండం నీళ్ళు తీయడమే కాకుండా ఎంతో పోషక విలువలు కలిగిన లేత కొబ్బరిని కూడా తేలికగా తీసుకొని తినవచ్చని అఖిల్ తెలిపారు.