తెరాస నేతలకెనా దళిత బందు

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలి*

 బీజేవైఎం యాచారం మండల నాయకులు బండ లింగం



ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి11(జనంసాక్షి) అర్హులైన వారందరికీ దళిత బంధు డబ్బులు మంజూరు చేయాలని బీజేవైఎం మండల నాయకులు బండ లింగం అన్నారు ఈ సందర్భంగా యాచారం లో ఆయన మాట్లాడుతూ  అర్హులైన దళితులందరికి   దళిత బంధు అమలు చేయాలని అన్నారు యాచారం మండలం లో 14 మంది లబ్ది దారులకు ఇవ్వడం అది కూడా అధికార పార్టీ నాయకులకే మంజూరు చేయటం సిగ్గు చేటని అన్నారు దళిత బంధు ద్వారా టిఆర్ఎస్ నాయకులే లబ్ధి పొందుతున్నారని ఆయన అన్నారు మండలం లో  దళిత వర్గానికి చెందిన నిరుద్యోగ యువకులు పెద్ద చదువులు చదివి కూడా ఉద్యోగాలు రాక కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని అన్నారు అలాంటి నిరుద్యోగ యువతను అదుకొని ఏదైనా వ్యాపారం చేసుకోవటానికి దళిత బంధు పథకం మంజూరు చేసి ఆదుకోవాలి కానీ ప్రభుత్వం  అధికార పార్టీ నాయకులకే దళిత బంధు పథకం మంజూరు చేయటం దారుణం అని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అది చేస్తాం ఇది చేస్తాం అని గొప్పలు చెప్పుతూ ఏదైనా ప్రభుత్వ కార్యక్రమలు చేసినప్పుడు పంది మంది లబ్ది దారులకు ఇచ్చి అందరికి ఇస్తున్నాం అని మీడియాలో ఫోకస్ చేయటం తప్ప చేసింది ఏమి లేదు చేసేది గోరంత చెప్పేది కొండంత అని అన్నారు దళితలందరికి దళిత బంధు మంజూరు చేస్తా అని మాయ మాటలు చెప్పుతూ దళితులను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాబోయే రోజుల్లో దళితులు తగిన గుణపాఠం చెప్పటం కాయం అన్నారు