టీచర్లకు నేటినుంచి బయోమెట్రిక్‌ ఎపి సర్కార్‌ ఆదేశాలు


అమరావతి,ఫిబ్రవరి8(జనం సాక్షి): ఆందోళన చేస్తున్న టీచర్లపై జగన్‌ సర్కార్‌ గురి పెట్టింది. బుధవారం నుంచి బయోమెట్రిక్‌ తప్పనిసరి చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇ`హాజరులో టీచర్ల అటెండెన్స్‌ని సాయంత్రానికి పంపాలని హుకుం జారీ చేసింది. డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పీఆర్సీపై ఉపాధ్యాయులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రత్యేక జేఏసీ ఏర్పాటు
చేసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు యోచిస్తున్నాయి. దీంతో టీచర్ల ఆందోళనలపై ఒత్తిడి తీసుకురావాలని సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం నుంచి బయోమెట్రిక్‌ తప్పనిసరంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.