కపిలేశ్వరాలయంలో నేడు శివరాత్రి వేడుకలు

తిరుపతి,ఫిబ్రవరి28  ( జనం సాక్షి): మహాశివరాత్రి సందర్భంగా శ్రీకపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు మంగళవారం ఘనంగా జరగనున్నాయి. ఆలయంలో కరోనా నిబంధనల మేరకు శివరాత్రి ప్రత్యేక కార్యక్రమాలు ఏకాంతంగా నిర్వహిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున 2:30 గంటల నుంచి 4:30 గంటల వరకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, ఉదయం 7 నుంచి 8 గంటల వరకు రథోత్సవం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.

ఉదయం 5:30 నుంచి రాత్రి12 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. సాయంత్రం 6 నుంచిరాత్రి 10 గంటల వరకు విశేషమైన నంది వాహనసేవ ఆలయంలోనే జరుపుతారు. మార్చి 2వ తేదీ తెల్లవారుజామున 12 నుంచి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం నిర్వహిస్తారు.