పోతినను విచారించిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

విజయవాడ,ఫిబ్రవరి1(జనం సాక్షి): అస్లాం మృతి కేసులో మంత్రి వెల్లంపల్లిపై ఆరోపణలు చేసిన జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్‌ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు విచారించారు. ఈ వ్యాఖ్యలకు ఆధారాలు ఇవ్వాలంటూ ఆయనను కోరారు. గంటన్నరపాటు మహేష్‌ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు విచారించారు. అనంతరం జనసేన నేత విూడియాతో మాట్లాడుతూ...‘సయ్యద్‌ అస్లాం మృతి కేసులో నేను అనేక అంశాలు మాట్లాడాను. ఈ కేసుకు సంబంధించి ఆధారాలు ఉంటే ఇవ్వాలని టాస్క్‌ ఫోర్స్‌ ఏసీపీ రమణమూర్తి అడిగారు. ఈ కేసుపైనే నన్ను గంటన్నర పాటు విచారించారు. ఎటువంటి ఆధారాలు ఉన్నా... వ్యక్తుల ప్రమేయం తెలిసినా చెప్పాలన్నారు. నా దగ్గర ఉన్న సమాచారం కూడా పోలీసులకు వివరించాను... దర్యాప్తు పూర్తయ్యే వరకు అన్ని విధాలా సహకరిస్తాను‘ అని పోలీసులకు చెప్పినట్లు పోతిన మహేష్‌ వెల్లడిరచారు.