కరివిరాల మోడల్ స్కూల్ సమస్యలు మంత్రుల ద్రుష్టికి తీసుకెళ్తాను


- కోదాడ నియోజకవర్గ టీఆరెఎస్ నాయకులు జలగం సుధీర్

మునగాల, ఫిబ్రవరి 10(జనంసాక్షి): నడిగూడెం మండలంలోని కరివిరాల గ్రామ మోడల్ స్కూల్ లో ఉన్న సమస్యలను త్వరలోనే మంత్రుల దృష్టికి తీసుకు వెళ్లాలని నిర్ణయించినట్లు కోదాడ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జలగం సుధీర్ శుక్రవారం మోడల్ స్కూల్ ను సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న సమస్యల గురించి ప్రిన్సిపల్ షరీఫ్, ఇతర ఉపాద్యాయులతో చర్చించటం జరిగిందని తెలిపారు. మోడల్ స్కూల్ లో వంటగది లేకపోవటంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సరైన సమయంలో బిల్లులు అందెలా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని వంట సిబ్బంది తెలిపారు. క్లాస్ రూంలు ఉన్న ప్రాంగణంలోనే టాయిలెట్ లు ఉండటం వల్ల విద్యార్దులకు కొంత ఇబ్బందులు ఉన్నాయని, మరికొన్ని టాయిలెట్ లు బయట ఉండేలా ఏర్పాటు చేయాలని కొంతమంది విద్యార్దులు కోరారు. ఇంటర్మీడియట్ విద్యార్దులకు డయల్ 100, ఆర్ధిక క్రమశిక్షణ, భవిశ్యత్ అవకాశల మీద కొంతసేపు అవగాహన కల్పించటం జరిగింది. ఈ నెల 11న ప్రవాస భారతీయులతో కెటీఆర్ మరియు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డిలు నిర్వహించే "మన ఊరు మన బడి " జూం మీటింగ్ లో అనంతగిరి పాఠశల, కోదాడ మండలం కుచిపూడి బడి సమస్యలతో పాటు కరివిరాల మోడల్ స్కూల్ లోని వంటగది, ఇతర సమస్యలు  ప్రస్తావించి వారి ద్వారా సత్వర సహయం జరిగేందుకు క్రుషి చేయనున్నట్టు జలగం సుధీర్ తెలిపారు.