రాజన్న ఆలయానికి ఉచిత బస్‌ సర్వీస్‌

వేములవాడ,ఫిబ్రవరి28  ( జనం సాక్షి): మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని వేములవాడకు వచ్చిన భక్తులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. తెవేములవాడ రాజన్న దేవాలయాన్ని దర్శించుకునే భక్తులకు ఫ్రీ బస్సు సదుపాయం కల్పిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. అయితే ఈ సదుపాయం వేములవాడ బస్‌ స్టాప్‌ నుంచి రాజన్న టెంపుల్‌ వరకు ఉంటుందన్నారు. మొత్తం 14 మినీ బస్సులు ఏర్పాటు చేశామని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కాగా.. ఈ రోజు నుంచి వేములవాడ రాజన్న దేవాలయంలో శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరుగనున్న ఈ ఉత్సవాల్లో.. దాదాపు 4 లక్షల మంది వరకు భక్తులు వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.