టిఆర్‌ఎస్‌ను ఢీకొనే క్రమంలో బిజెపి తంటాలు


మరింత దూకుడు పెంచిన అధికార టిఆర్‌ఎస్‌

కెసిఆర్‌ పట్టుదలగా పోరాడగలరా అన్నదే సమస్య
హైదరాబాద్‌, ఫిబ్రవరి 12 (జనం సాక్షి): ఏపీ విభజన తీరుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలతో బీజేపీ ఆత్మరక్షణలో పడిరది. తెలంగాణ ఏర్పాటుకు పార్లమెంటులో పూర్తిస్థాయిలో సహకరించిన బీజేపీ ఇప్పుడు అదే విషయంలో ఆత్మరక్షణలో పడడం ఆ పార్టీ వర్గాలకు మింగుడు పడడం లేదు. అదే ఇప్పుడు టిఆర్‌ఎస్‌కు కలసి వస్తోంది. తొలిరోజే సెంటిమెంట్‌ను రగిలించి ఆందోళనకు దిగడంతో మంచి ఊపే వచ్చింది. అయితే ఇది ఎంతకాలం ఉంటుందన్నది ప్రశ్న. బిజెపిని ఢీకొనే కార్యక్రమం నిరంతరాయంగా ఉంటుందా అన్నదే ప్రశ్న. పార్లమెంటులో ప్రివలేజ్‌ మోషన్‌ ఇచ్చినా అది చర్చకు స్వీకరిస్తారా లేదా అన్నది కూడా ప్రశ్నే. కెసిఆర్‌ ఖచ్చితంగగా అధికార బిజెపికి వ్యతిరేకంగా పోరాడుతారా అన్నది కూడా ప్రశ్నే. విపక్షాలను కూడగట్టి పోరాడాలంటే సత్తా కావాలి. కేంద్రంతో ఢీకొట్టగలగాలి. అయితే కెసిఆర్‌కు ఇంటి సమస్యలు కూడా అనేకం ఉన్నాయి. ఇంటగెలిచి రచ్చ గెలవాలంటారు. మోడీని ఢీకొనాలంటే ముందు లోకల్‌గా అనేక సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగుల ఆందోళన అతిపెద్ద సమస్యగా ఉంది. 317 జీవో వ్యవహారం ముదురుతోంది. ఈ క్రమంలో జనగామ వేదికగా కేంద్రాన్ని ఢీకొంటామని ప్రకటించారు. అయితే బిజెపి కూడా అదే తరహాలో మోడీ వ్యాఖ్యల వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నంలో పడిరది. వివిధ అంశాలపై విరుచుకుపడుతున్న సమయంలో తాజా పరిణామం అధికార పార్టీకి కలసివచ్చింది. కాంగ్రెస్‌ పార్టీనే లక్ష్యంగా చేసుకుని ప్రధాని మోదీ విమర్శలు చేసినా.. ఆయన వ్యాఖ్యలు తెలంగాణలో బిజెపి పార్టీ నాయకులను కొంత ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టాయి. వివిధ అంశాలపై ఆందోళనలు చేస్తూ.. వివిధ వర్గాలకు దగ్గరవుతూ అధికార పార్టీని ఇరుకున పెడుతున్నామని బిజెపి బావిస్తున్నది. కానీ పెద్దగా ప్రయోసంª` లేకుండా పోతున్నది.తెలంగాణ లో అధికారం దిశగా అడుగులు వేస్తున్నామని భావిస్తున్న సమయంలో తాజా పరిణామం ఇబ్బందికరంగా పరిణమించింది.గత అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపీ నామమాత్రంగానే ఉంది. సంజయ్‌ పార్టీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీలో కొంత జోష్‌ వచ్చింది. దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో గెలవడం, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మంచి పనితీరు కనబరచడంతో పార్టీ దూకుడు పెంచింది. ఇటీవలి కాలంలో అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ ఆందోళనలు చేస్తోంది. రాష్ట్రంలో నిరుద్యోగుల్లో పేరుకుని పోయిన అసంతృప్తిని తమకు అనుకూలంగా మలచుకుంటూ నిరుద్యోగ దీక్ష చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ సర్కారుపై ఒత్తిడి పెంచుతోంది. ఉద్యోగుల బదిలీకు సంబంధిం చిన జీవో 317 విషయంలోనూ బీజేపీ ఉద్యమ బాట పట్టింది. కరీంనగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఉద్యోగులకు మద్దతుగా సంజయ్‌ దీక్ష చేయడం.. ఆయనను అరెస్టు చేయడం బీజేపీకి బాగానే కలసి వచ్చిందన్న అభిప్రాయం వచ్చింది. కేసీఆర్‌కు, తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేయడంతో అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగిందనే అభిప్రాయాన్ని కలిగించారు. ఇక, ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీని ఇరుకున పెట్టడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రయత్నించినా.. చివరకు ఫలితం ఇవ్వలేదు. ధాన్యం కొనబోమని చెప్పడం పెద్ద మైనస్‌గా మారింది. రాష్ట్రంలో ఎన్ని ప్రజాకర్షక పథకాలను ప్రవేశపెడుతున్నా వివిధ వర్గాల్లో వ్యక్తమవు తున్న వ్యతిరేకతకు టీఆర్‌ఎస్‌ పసిగట్టడం లేదు. తాను పట్టిన కుందేటికి మూడేకాల్లు అన్నచందంగా తాము చేసింª`దే కరెక్ట్‌ అన్న ధోరణిలో వేయలేక పోతోంది. తమపై పెరుగుతున్న వ్యతిరేకత, హావిూల అమలు అసాధ్యమవుతున్న సమయంలో ప్రధాని వ్యాఖ్యలతో టీఆర్‌ఎస్‌ మరోసారి సమస్యలను పక్కన పెట్టి దూకుడు ప్రద్శించే అవకాశాన్ని అందిపుచ్చు కుంది. జనగామలో సిఎం కెసిఆర్‌ దూకుడుకు ఇదే కాణమని భావించాలి. తెలంగాణకు మోదీ వ్యతిరేకి అంటూ ఇటు కాంగ్రెస్‌, అటు టీఆర్‌ఎస్‌ ఒకేసారి దాడి చేస్తుండడంతో రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాని వ్యతిరేకం కాదంటూ వివరణ ఇచ్చుకునే పనిలో బిజెపి నేతలు పడ్డారు. ప్రధాని మోదీ కాంగ్రెస్ను విమర్శిస్తే టీఆర్‌ఎస్‌ నాయకులు ఎందుకు భుజాలు తడుముకుం టున్నారని ప్రశ్నిస్తోంది. మొత్తంగా ఇప్పుడు బిజెపిక గడ్డుకాలం దాపురించిందనే చెప్పాలి.