పంజాబ్‌లో మోడీ ప్రచారం ఫలించేనా


కొంప ముంచనున్న కాంగ్రెస్‌ అంతర్గ కుమ్ములాటలు

సర్వేలన్నీ ఆప్‌కు అనుకూలంగా ఉన్నట్లు వెల్లడి
చండీగడ్‌.ఫిబ్రవరి17 (జనంసాక్షి):  పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. పక్రధాని కూడా
రంగంలోకి దిగి ప్రచారం చేపట్టారు. బిజెపికి అధికారం అప్పగిస్తే వ్యవసాయ, వాణిజ్య రంగాలను పటిష్టంచేస్తామని, లాభసాటి చేస్తామని ప్రకటించారు. నిజానికి వ్యవసాయ చట్టాలతో ఏడాదిగా పోరాడి ప్రభుత్వంపై యుద్దంచేసిన ఘనత పంజాబ్‌ రైతులదే. ఇలాంటి సమయంలో బిజెపి తీరుపై రైతుల్లో ఆగ్రహంఉంది. ఆప్‌ కూడా గట్టిగానే పోరాడుతోంది. సర్వేలన్నీ ఆప్‌కు అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయనిచెబుతున్నాయి. ఇదే క్రమంలో అధికార కాంగ్రెస్‌ పార్టీలో మాత్రం అంతర్గత కుమ్ములాట కొలిక్కి రావడం లేదు. ప్రత్యర్థుల్ని వదిలి సొంత పార్టీ వాళ్లపైనే విమర్శలు చేసుకుంటున్నారు. అమరీందర్‌ కాంగ్రెస్‌ను వదిలి వెళ్లడంతో ఇక గెలుపు అవకాశాలు తక్కువనే ప్రచారం ఉంది. సిఎం చన్నీపైనే సిద్ధూ కూతురు ఆరోపణలు చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. పార్టీలో అంతర్గతంగా ఎన్ని వివాదాలు, అభిప్రాయ బేధాలున్నా ఎన్నికలనే సరికి అంతా కలిసికట్టుగా పని చేయాలి. అప్పుడు గెలుపు అవకాశాలు మెరుగవుతాయి. కానీ పంజాబ్‌ కాంగ్రెస్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. ముఖ్యమంత్రి చరణ్‌ జీత్‌ సింగ్‌ చన్నీ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ మధ్య వివాదానికి తెరపడడం లేదు. ఎన్నికల్లో పార్టీని కాడెద్దుల్లా ముందుకు తీసుకెళ్లాల్సిన వీళ్లిద్దరి మధ్య పొట్లాటకు తెరపడడం లేదు. తండ్రి తరఫున ఎన్నికల ప్రచారం చేస్తూ సిద్ధూ కూతురి కామెంట్స్‌ దుమారం రేపుతున్నాయి. అమృత్‌సర్‌ ఈస్‌లో సిద్ధూ కూతురు రబియా సిద్దూ ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి చరణ్‌ జీత్‌ సింగ్‌ చన్నీపై సంచలన వ్యాఖ్యలు చేశారామె. చన్నీ అవినీతిపరుడన్నారు. అతను చెప్పుకుంటున్నట్టు పేదవాడు ఏవిూ కాదని బ్యాంక్‌ అకౌంట్లో 133 కోట్ల రూపాయలు ఉన్నాయన్నారు రబియా సిద్దూ.
చన్నీని కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేయడాన్ని కూడా తప్పుబట్టారు. తప్పనిసరి పరిస్థితుల్లో
అధినాయకత్వం ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని అభిప్రాయపడ్డారు రబియా. అంత మాత్రం చేత నిజాయితీపరుడ్ని ఎక్కువకాలం ఆపలేరని అన్నారు. తప్పుడు వ్యక్తికి ఆగిపోకతప్పని పరిస్థితులు వస్తాయన్నారు రబియా సిద్దూ. పంజాబ్‌ అభివృద్ధి కోసం పరితపిస్తున్న తమ తండ్రి సిద్దూతో చన్నీకి ఎలాంటి పోలికా లేదన్నారు రబియా సిద్దూ. నిజానిదే అంతిమ విజయమన్నారామె. మొత్తానికి పంజాబ్‌ ఓ వైపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే? కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కొలిక్కి రాకపోవడం లేదు. మొత్తంగా ఇప్పుడు బిజెపికి ఎలాగే పరిస్తితి అనుకూలంగా లేదు. కాంగ్రెస్‌ అంతర్గ కుమ్ములాటలు కారణంగా తన ఓటమిని తానే కొని తెచ్చుకుందని విమర్శకులు అంటున్నారు. ఈ క్రమంలో అనూహ్యంగా ఆప్‌ అధికార పీఠానికి దూసుకుని వచ్చేలా ఉంది. రేపు అధికారంª` చేపట్టినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.