డ్రోన్ స్ప్రే తో వ్యవసాయ రంగంలో నూతన ఒరవడి

 

కోటగిరి ఫిబ్రవరి 26 జనం సాక్షి:- మండలంలోని ఎత్తొండ గ్రామానికి చెందిన సిరిగిరి సుదర్శన్ డ్రోన్ స్ప్రే తో వ్యవసాయ రంగంలో నూతన ఒరవడి సృష్టించాడు.తనకున్న మూడెకరాల పొలంలో సన్‌ఫ్లవర్ పంటను వేసి లేటెస్ట్ టెక్నాలజీతో పంట పండిస్తున్నాడు.అంతేకాకుండా పంటకు పట్టిన చీడపురుగులను వదిలించుకునేందుకు టీవీల్లో, సోషల్ మీడియాలో చూపుతున్న విధంగా డ్రోన్‌ సహాయంతో పురుగుల మందు స్ప్రే చేశాడు. డ్రోన్‌తో స్ప్రే చేయటం వల్ల రైతులకు ఖర్చు తగ్గటంతో పాటు,సమయం ఆదా అవుతుందని ఆరైతు పేర్కొన్నాడు.కాగా తన స్నేహితుల ద్వారా ఈ డ్రోన్ తెప్పించానని ఎకరాకు స్ప్రే చేసేందుకు నాలుగువందల రూపాయలు మాత్రమే అద్దె ఉంటుందని ఈ సందర్భంగా తెలిపాడు. కూలీల కొరత ఉన్న ఈరోజుల్లో ఇలాంటి నూతన ఆలోచన రైతులకు మేలు చేస్తుందని యువ రైతు తెలిపాడు