ఊరు`మన బడి కార్యక్రమం అమలులో ముందుండాలి


పాఠశాలలను అన్ని విధాలుగా తీర్చిదిద్దాలి

ఎక్కడా వసతుల కొరత లేకుండా చేయాలి
కలెక్టరేట్‌లో ఉన్నతస్థాయి సవిూక్షలో మంత్రి ఎర్రబెల్లి
వరంగల్‌,ఫిబ్రవరి25  (జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు ` మన బడి కార్యక్రమం అమలులో భాగంగా స్కూళ్లను అన్ని రకాలుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రావిూణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సూచించారు. పాఠశాలల్లో సమస్యలు లేకుండా చూడాలన్నారు. ప్రతి పాఠశాలలో నిరంతర నీరు, మరుగుదొడ్లు, విద్యుత్‌, మంచినీరు, ఫర్నీచర్‌, ప్రహరీ గోడలు, వంట గది, అదనపు గదుల, మరమ్మతులు, డిజిటల్‌ వంటి అన్ని సదుపాయాలు కల్పించాలి. ఆధునిక వసతులు ఉండాలి. పాత భవనాలను అధునికరించాలని మంత్రి సూచించారు. ఆ కార్యక్రమం అమలుపై వరంగల్‌, హన్మకొండ కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మంత్రి సవిూక్ష చేశారు. ముందుగా అధికారులు మన ఊరు మన బడి కార్యక్రమం కింద చేపట్టిన చర్యలను వివరించారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు తమ సూచనలు, సలహాలు ఇచ్చారు. స్కూల్స్‌ ఎంపికలో తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? పథకం అమలు పై అధికారుల చర్యలేంటి? అధికారుల పనితీరు ఏ విధంగా ఉంది? ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నారా? వంటి పలు అంశాల పై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. హనుమకొండ జిల్లాలో492 స్కూల్స్‌ ఉండగా 176 స్కూల్స్‌ ని ఎంపిక చేశారు. ఇందులో 84 ప్రాథమిక, 18 ప్రాథమికోన్నత, 74 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వరంగల్‌ జిల్లాలో 645 స్కూల్స్‌ ఉండగా అందులో 223 స్కూల్స్‌ ని ఎంపిక చేశారు. ఇందులో 123 ప్రాథమిక, 20 ప్రాథమికోన్నత, 80 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఎంపిక చేసిన 35 శాతం స్కూల్స్‌ లో 70 శాతం విద్యార్థులు కవర్‌ అవుతున్నారు.ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు మాట్లాడుతూ, సీఎం కెసిఆర్‌ మన ఊరు మన బడి పథకాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
వనరుల నిర్వహణకు కమిటీ వేసి, నిధుల నిర్వహణ కోసం ప్రత్యేక ఖాతాను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
ప్రజా ప్రతినిధులను, అధికారులు, గ్రామపెద్దలను తల్లిదండ్రులను బడుల బాగుకోసం బాగస్వామ్యం చేయాలన్నారు. ఎన్‌ఆర్‌ఐలను, దాతలను స్కూల్స్‌ దత్తత తీసుకునేలా ప్రోత్సాహించాలని, విద్యార్థుల సంఖ్య ను గణనీయంగా పెంచడంతోపాటు మంచి వాతావరణంలో నాణ్యమైన విద్య బోధన జరగాలని సూచించారు. ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి.మండలాన్ని యూనిట్‌ గా తీసుకొని గ్రామం, పాఠశాల ను ఎంపిక చేసి, ఆ పాఠశాలలో విద్యార్థుల నమోదు ఆధారంగా మొత్తం హన్మకొండ, వరంగల్‌ జిల్లాలోని పాఠశాలల్లో మూడవ వంతు పాఠశాలలను ఎంపిక చేశారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌, వరంగల్‌ జెడ్పీ చైర్మన్‌ సుధీర్‌ కుమార్‌, ఎంపీ పసునూరి దయాకర్‌, ఎమ్మెల్సీలు నర్సిరెడ్డి, బండా ప్రకాశ్‌, ఎమ్మెల్యేలు చల్లా ధర్మా రెడ్డి, అరురి రమేశ్‌, పెద్ది సుదర్శన్‌ రెడ్డి, నన్నపనేని నరేందర్‌ తదితర ప్రజా ప్రతినిధులు.... వరంగల్‌ కలెక్టర్‌ గోపి, హన్మకొండ కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, హరిసింగ్‌, శ్రీవాత్సవ, డీఈవోలు వాసంతి, రంగయ్య నాయుడు, విద్యా, వివిధ శాఖలకు చెందిన పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు